సల్మాన్‌ బావ... కత్రినా చెల్లి! | Katrina Kaif's Sister Isabelle to Debut Opposite Aayush sharma | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ బావ... కత్రినా చెల్లి!

Published Sun, Aug 4 2019 1:52 AM | Last Updated on Sun, Aug 4 2019 1:52 AM

Katrina Kaif's Sister Isabelle to Debut Opposite Aayush sharma - Sakshi

ఇసాబెల్లా, ఆయుష్‌

ఇండియా–మయన్మార్‌ బోర్డర్‌ పరిసర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు సల్మాన్‌ఖాన్‌ బావ ఆయుష్‌ శర్మ. ఆయుష్‌కు తోడుగా కత్రినా కైఫ్‌ చెల్లెలు ఇసాబెల్లా కైఫ్‌ కూడా వెళ్లనున్నారు. ఓ సినిమా కోసం ఇద్దరూ ఇలా తోడయ్యారు. ఈ చిత్రానికి కరణ్‌ భూతాని దర్శకత్వం వహిస్తారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాం.

ఇందులో నేను ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నాను. ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా బాగా కష్టపడుతున్నాను. ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు ఆయుష్‌ శర్మ. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలీవుడ్‌లో ఇసాబెల్లాకు ఇది రెండో చిత్రం. ఇంతకు ముందు ‘టైమ్‌ టు డ్యాన్స్‌’ అనే సినిమా కమిట్‌ అయ్యారామె. ఇది చిత్రీకరణలో ఉండగానే రెండో సినిమాకి అవకాశం తెచ్చుకోగలిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement