కత్రీనా పెళ్లిపై సల్మాన్​ ఖాన్​ రియాక్షన్​.. కమిటెడ్​ అని హింట్​ ! | Salman Khan Congratulates Katrina Kaif On Her Wedding | Sakshi
Sakshi News home page

Salman Khan: కత్రీనా పెళ్లిపై సల్మాన్​ ఖాన్​ రియాక్షన్​.. కమిటెడ్​ అని హింట్​ !

Published Mon, Jan 31 2022 8:50 PM | Last Updated on Mon, Jan 31 2022 10:21 PM

Salman Khan Congratulates Katrina Kaif On Her Wedding - Sakshi

Salman Khan Congratulates Katrina Kaif On Her Wedding: బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​ వరుస సినిమాలతో ఫుల్​ జోష్​ మీదున్నాడు. టైగర్​ 3, పవనపుత్ర భాయిజాన్​, దబాంగ్​ 4, నో ఎంట్రీ 2 సినిమాలతో అలరించనున్నాడు. ప్రస్తుతం వీటిలో కొన్ని చిత్రీకరణ జరుపుకుంటుండగా మరికొన్ని సెట్స్​పైకి వెళ్లనున్నాయి. అయితే బీటౌన్​లో మోస్ట్​ ఎలిజబుల్ బ్యాచ్​లర్​గా పేరొందిన సల్మాన్​ ఇటీవలే 56వ పడిలోకి అడుగు పెట్టాడు. అయితే తమ అభిమాన హీరో సల్లూ భాయ్​ ఓ ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్​ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్​లో పలువురు హీరోయిన్లతో సల్మాన్​ రిలేషన్​లో ఉన్నట్లు ఇప్పటికే అనేకసార్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై సల్లూ భాయ్ ఎప్పుడూ స్పందించలేదు. 

అయితే తాజాగా తన రిలేషన్​షిప్​ స్టేటస్​ గురించి తాజాగా స్పందిచాడు భాయిజాన్​. అంతేకాకుండా తన స్నేహితురాలు కత్రీనా కైఫ్​ వివాహంపై కూడా మాట్లాడాడు. జనవరి 30 ఆదివారం జరిగిన హిందీ బిగ్​బాస్​ సీజన్​ 15 ఫినాలేలో ఆ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ గ్రాండ్ ఫినాలేకు పలువురు సెలబ్రిటీలు వచ్చి బిగ్​బాస్​ స్టేజిపై సందడి చేశారు. ఇందులో భాగంగా కత్రీనా కైఫ్​ నర్తించిన చికినీ చమేలి పాటకు మాజీ బిగ్​బాస్​ కంటెస్టెంట్స్​ రాఖీ సావంత్​, రుబీనా దిలాయక్​ డ్యాన్స్​ చేశారు. తర్వాత 'కంగ్రాట్స్ కత్రీనా.. మీ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ వివాహంతో అందరూ సంతోషిస్తున్నారు.' అని కెమెరావైపు చూసి తెలిపాడు. అనంతరం కత్రీనా కైఫ్​ విషయంపై షెహనాజ్​ గిల్ సరదాగా సల్మాన్ టీజ్​ చేసింది. 

​సల్మాన్​ అలా చెప్పగానే 'మీరు కూడా సంతోషంగా ఉన్నారా ? అయినా మీరు సింగిల్​గా ఉంటేనే బాగుంటారు' అనగా 'అవును. నేను సింగిల్​గా అయినప్పుడే మరింత మెరుగ్గా కనిపిస్తాను' అని సల్లూ భాయ్​ సమాధానం ఇచ్చాడు. దీంతో షెహనాజ్​ 'ఇప్పుడు మీరు కమిటెడ్ ఆ ?' అని అడగ్గా సల్మాన్​ సమాధానం ఇవ్వకుండా నవ్వాడు. అయితే ఇటీవల సమంత లాక్​వుడ్​తో సల్మాన్​ రిలేషన్​లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement