![Salman Khan To Ranbir Kapoor Sends Costly Gifts To Katrina Kaif And Vicky Kaushal - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/14/katrina-kaif-and-salman-kha.jpg.webp?itok=CnvmJee6)
Katrina Kaif Ex Boyfriends Salman Khan, Ranbir Kapoor Sends Costly Gifts On Her Wedding: ప్రస్తుతం బి-టౌన్‌లో కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి హాట్‌టాపిక్‌గా మారింది. పెళ్లి వరకు గొప్యత పాటించిన ఈ జంట అనంతరం వరసపెట్టి ఫొటోలు షేర్ చేస్తున్నారు. ‘మా మనసులో ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమ, కృతజ్ఙత మమ్మల్ని ఇంతదాకా తీసుకువచ్చింది. మా ఈ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు కావాలంటూ’ విక్ట్రీనాలు పోస్ట్‌లు షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కాగా రాజస్థాన్‌లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక దీనికి ఎంతమంది బాలీవుడ్ సెలబ్రెటీలు వెళ్లారు, ఎవరెవరికి ఆహ్వానాలు అందాయన్న దానిపై స్పష్టత లేదు.
చదవండి: కాజల్‌పై బిగ్‌బాస్ నిర్వాహకులు సీరియస్! ఆ రూల్ బ్రేక్ చేసిందా?
ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఈ జంటకు ఖరీదైన బహుమతులు అందినట్లు తెలుస్తోంది. వీరిలో కత్రినా మాజీ ప్రియులు రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్‌లు ఉండటం ఆసక్తినెలకొంది. కత్రీనా పెళ్లి సందర్భంగా ఆమె మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్ 2.7 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇవ్వగా.. ఈ కొత్త జంటకు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ 3 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును కానుగా ఇచ్చినట్టు బి-టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా గతంలో కత్రినా సల్మాన్ ఖాన్‌తో ప్రేమ వ్యవహరం నడపగా వీరిద్దరి బ్రేకప్ అనంతరం రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే.
చదవండి: విక్కీ, కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. రొమాంటిక్ లుక్‌లో మెరిసిపోతున్న క్యూట్ కపుల్
అంతేకాదు ముంబైలో ఓ ప్లాట్ తీసుకుని అక్కడ రణ్‌బీర్, కత్రినాలు ఎడాది పాటు కలిసి ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక సల్మాన్, రణ్‌బిర్‌తో పాటు అలియా భట్ లక్ష రూపాయల విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్‌ను కత్రినాకు బహుమతిగా ఇచ్చిందని, రూ. 6.4లక్షల విలువైన డైమండ్ చెవి దుద్దులను విరూష్కలు గిఫ్ట్ పంపించారని సమాచారం. అలాగే షారుఖ్ ఖాన్ వారి వివాహ వేడుకలో రూ. 1.5 లక్షలు విలువ చేసే ఖరీదైన పెయింటింగ్‌ను ఇవ్వగా, హృతిక్ రోషన్.. విక్కీకి 3 లక్షల రూపాయలు విలువ చేసే బీఎండబ్య్లూ జీ310 ఆర్ బైక్‌ను ఇచ్చాడట. ఇక తాప్సీ కూడా విక్కీకి 1.4లక్షల రూపాయల విలువైన ప్లాటినం బ్రెస్‌లెట్‌ను బహుమతిగా ఇచ్చిందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment