
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా ప్రారంభించాడు. ఇప్పటికే రంగస్థలం షూటింగ్ దాదాపుగా పూర్తి కావటంతో తరువాతి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన కొత్త సినిమాను శుక్రవారం మొదలు పెట్టాడు. ఈ సినిమాలో చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇటీవల ఈ సినిమాపై రకరకాల వార్తలు టాలీవుడ్ లో హల్‌చల్ చేశాయి. ఈ సినిమా మల్టీ స్టారర్ జానర్‌లో తెరకెక్కనుందన్న టాక్ తో పాటు సినిమా ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తున్న రంగస్థలం సినిమా టీజర్‌ను జనవరి 24న విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment