‘‘లైఫ్‌లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే సక్సెస్ విలువ తెలుస్తుంది. ఫెయిల్యూర్స్ నుంచే కాదు సక్సెస్ నుంచి కూడా ఒక మంచి పాఠం నేర్చుకున్నప్పుడే లైఫ్ మరింత మెరుగవుతుంది’’ అంటున్నారు కృతీ సనన్. లైఫ్ గురించి ఆమె ఇంకా మాట్లాడుతూ – ‘‘జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. కష్టానికి కంగారు పడకూడుదు. సక్సెస్‌కు సంబరపడిపోకూడుదు. పరిస్థితులకు తగ్గట్లు ముందుకు సాగాలి. నాకు టీమ్ నచ్చితేనో లేక సినిమాలో నా క్యారెక్టర్ నచ్చినప్పుడు మాత్రమే యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటాను. లేకపోతే లేదు.
ఎవరికైనా లైఫ్‌లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ కామనే. కాకపోతే ఈ జర్నీలో కొత్తగా ఏం నేర్చుకున్నామన్నదే ఇంపార్టెంట్. నీ చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు నిన్ను నిరుత్సాహపరచడానికి రెడీగా ఉంటారు. నీ కలను అడ్డుకోవడమే వారి పని. అలాంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఆగకండి. మీ పనిని మీరు ఎంత బాధ్యతగా, ప్రేమగా చేస్తున్నారన్నదే ముఖ్యం’’ అని చెప్పారు. ఇక ఇండస్ట్రీ వాతావరణం గురించి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో మెంటల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను.
ముఖ్యంగా మనపై మనకు నమ్మకం ఉండాలి. మంచి జాబ్ ఆఫర్స్ వదులుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను నేను. మొదట్లో మోడలింగ్, టీవీ కమర్షియల్స్ చేశాను. ఆ తర్వాత నాపై నమ్మకంతో యాక్టింగ్ వైపు అడుగులు వేశా. కష్టపడ్డాను. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తున్నాను. నీ పనికి ఎంత కష్టాన్ని ఇవ్వగలవో అంత ఎక్కువ ప్రతిఫలాన్ని నువ్వు పొందగలవు’’ అని చెప్పుకొచ్చారామె. ప్రస్తుతం రోహిత్ జుగరాజ్ దర్శకత్వంలో దిల్జీత్ హీరోగా రూపొందుతున్న ‘అర్జున్ పాటియాలా’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగులో మహేశ్‌బాబు ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు కృతీ సనన్.
Comments
Please login to add a commentAdd a comment