కొత్త పాఠాలు | Kriti Sanon starts Marathi lessons for 'Panipat' | Sakshi
Sakshi News home page

కొత్త పాఠాలు

Nov 18 2018 4:02 AM | Updated on Nov 18 2018 4:02 AM

Kriti Sanon starts Marathi lessons for 'Panipat' - Sakshi

కృతీసనన్‌

ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 4’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు హీరోయిన్‌ కృతీసనన్‌. ఈ సినిమా దర్శకద్వయం ఫర్హాద్‌–సామ్జీ షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పగానే నేరుగా ఇంటికి వెళ్లకుండా మరాఠీ క్లాసులకు హాజరవుతున్నారామె. అయితే ఆమె మరాఠీ నేర్చుకుంటున్నది ‘హౌస్‌ఫుల్‌ 4’ కోసం కాదు. త్వరలో షూటింగ్‌ స్టార్ట్‌ కాబోయే ‘పానిపట్‌’ సినిమా కోసం. ‘‘పానిపట్‌’లో రాణిగా నటించబోతున్నాను. ఇందులో నా క్యారెక్టర్‌కు స్ట్రాంగ్‌ మరాఠీ ఫ్లేవర్‌ ఉన్న పెద్ద పెద్ద డైలాగ్స్‌ ఉన్నాయి.

అందుకే మరాఠీ క్లాసులకు వెళ్తున్నాను. నేను ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల మరాఠీ నాకు అంతగా తెలీదు. హౌస్‌ఫుల్‌ 4, పానిపట్‌ సినిమాల షెడ్యూల్స్‌ మధ్య పెద్దగా టైమ్‌ లేదు. అందుకే ఇలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు కృతీ. అశుతోష్‌ గోవారీకర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘పానిపట్‌’ సినిమాలో సంజయ్‌దత్, అర్జున్‌ కపూర్, పద్మినీ కోల్హాపురి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘హౌస్‌ఫుల్‌ 4, పానిపట్‌’ రెండూ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement