house ful
-
‘హౌస్‌ఫుల్ ’ఫ్యామిలీలోకి సంజయ్‌దత్
హిందీ హిట్ ఫ్రాంచైజీ ‘హౌస్‌ఫుల్’లో ‘హౌస్‌ఫుల్ 5’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, కృతీ సనన్, అనిల్ కపూర్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో సంజయ్ దత్ నటించనున్నట్లు చిత్రయూనిట్ శనివారం అధికారికంగా ప్రకటించింది. హౌస్‌ఫుల్ ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ సంజయ్ దత్‌ను ఈ ఫ్రాంచైజీలోకి స్వాగతించారు నిర్మాత సాజిద్ నడియాడ్వాలా. కాగా ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాను తొలుత ఈ ఏడాది దీ΄ావళి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చే ఏడాది జూన్ 6న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. -
కొత్త పాఠాలు
ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్లో పాల్గొంటున్నారు హీరోయిన్ కృతీసనన్. ఈ సినిమా దర్శకద్వయం ఫర్హాద్–సామ్జీ షూటింగ్‌కి ప్యాకప్ చెప్పగానే నేరుగా ఇంటికి వెళ్లకుండా మరాఠీ క్లాసులకు హాజరవుతున్నారామె. అయితే ఆమె మరాఠీ నేర్చుకుంటున్నది ‘హౌస్‌ఫుల్ 4’ కోసం కాదు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోయే ‘పానిపట్’ సినిమా కోసం. ‘‘పానిపట్’లో రాణిగా నటించబోతున్నాను. ఇందులో నా క్యారెక్టర్‌కు స్ట్రాంగ్ మరాఠీ ఫ్లేవర్ ఉన్న పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. అందుకే మరాఠీ క్లాసులకు వెళ్తున్నాను. నేను ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల మరాఠీ నాకు అంతగా తెలీదు. హౌస్‌ఫుల్ 4, పానిపట్ సినిమాల షెడ్యూల్స్ మధ్య పెద్దగా టైమ్ లేదు. అందుకే ఇలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు కృతీ. అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘పానిపట్’ సినిమాలో సంజయ్‌దత్, అర్జున్ కపూర్, పద్మినీ కోల్హాపురి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘హౌస్‌ఫుల్ 4, పానిపట్’ రెండూ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. -
హౌస్‌ఫుల్
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప కేంద్ర కారాగారంలో రోజురోజుకు ఖైదీల సంఖ్య పెరుగుతోంది. దీంతో సెంట్రల్ జైలు హౌస్‌ఫుల్‌గా మారుతోంది. ఇక్కడి అధికారులు, సిబ్బంది రోజురోజుకు పెరుగుతున్న ఖైదీల సంఖ్యను చూసి తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా కడప కేంద్ర కారాగారంలో వెయ్యి మంది ఖైదీలు ఉండేందుకు అవకాశం ఉంది. కానీ, మంగళవారం ఖైదీల వివరాలను గమనిస్తే పరిమితికి మించి ఉన్నారు. మొత్తం 1491 మంది కేంద్ర కారాగారంలో ఉన్నారు. వీరిని పర్యవేక్షించేందుకు సూపరింటెండెంట్‌తోపాటు డిప్యూటీ సూపరింటెండెంట్లు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, హెడ్ వార్డర్లు, వార్డర్లు మొత్తం కలిపి 181 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర కారాగారంలో 577 మంది పురుష జీవిత ఖైదీలు, 53 మంది మహిళా జీవిత ఖైదీలు ఉన్నారు. 842 మంది రిమాండ్ పురుష ఖైదీలు ఉన్నారు. 15 మంది రిమాండ్ మహిళా ఖైదీలు ఉన్నారు. మిగిలిన వారు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారు రిమాండ్‌లో ఉన్నారు. జీవిత ఖైదీలకన్నా రిమాండ్ ఖైదీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. అంతేకాకుండా 842 మంది రిమాండ్ ఖైదీలలో కేవలం ఎర్రచందనం కూలీలే 540మంది ఉండడం విశేషం. వీరందరికీ బ్యారక్‌లలో, బ్లాక్‌లలో సౌకర్యం కల్పించడం జైలు అధికారులకు తలనొప్పిగా మారింది. వాటర్ ట్యాంకు ఉన్నా మంచినీటి కొరత కూడా ఉంది. నెల రోజుల నుంచి ఈ సంఖ్య ఇంచుమించు కొనసాగుతోంది. ఇరవై రోజుల కిందట చిత్తూరు జిల్లా నుంచి ఒకేసారి 200 మందికిపైగా ఎర్రచందనం కూలీలను రిమాండుకు తరలించడంతో వారిని ఇక్కడ ఉంచేందుకు అవకాశం లేక జైలు అధికారులు తమ ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. దీంతో కొంతమంది రిమాండ్ ఖైదీలను ఆయా ప్రాంతాల్లోని జైళ్లకే తరలిస్తున్నారు.