‘హౌస్‌ఫుల్‌ ’ఫ్యామిలీలోకి సంజయ్‌దత్‌ | Sanjay Dutt To Play Key Role In Housefull 5 Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

Sanjay Dutt: ‘హౌస్‌ఫుల్‌ ’ఫ్యామిలీలోకి సంజయ్‌దత్‌

Published Sun, Jul 14 2024 8:05 AM | Last Updated on Sun, Jul 14 2024 10:43 AM

Sanjay Dutt Becomes Part In Housefull 5 Movie

 హిందీ హిట్‌ ఫ్రాంచైజీ ‘హౌస్‌ఫుల్‌’లో ‘హౌస్‌ఫుల్‌ 5’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్‌ కుమార్, అభిషేక్‌ బచ్చన్, రితేష్‌ దేశ్‌ముఖ్, కృతీ సనన్, అనిల్‌ కపూర్‌ ఈ సినిమాలో లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. తరుణ్‌ మన్సుఖాని దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో సంజయ్‌ దత్‌ నటించనున్నట్లు చిత్రయూనిట్‌ శనివారం అధికారికంగా ప్రకటించింది. హౌస్‌ఫుల్‌ ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ సంజయ్‌ దత్‌ను ఈ ఫ్రాంచైజీలోకి స్వాగతించారు నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా. కాగా ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమాను తొలుత ఈ ఏడాది దీ΄ావళి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చే ఏడాది జూన్‌ 6న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ తెలిపారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement