ఆ ముద్ర  చెరిగిపోయింది | Kruthi Sanan Next Movie Panipat | Sakshi
Sakshi News home page

ఆ ముద్ర  చెరిగిపోయింది

Published Mon, Jul 29 2019 1:21 AM | Last Updated on Mon, Jul 29 2019 3:50 AM

Kruthi Sanan Next Movie Panipat - Sakshi

కృతీ సనన్‌ 

‘‘హీరోయిన్‌గా అవకాశం తెచ్చుకోవడం కంటే నటిగా ప్రేక్షకుల మెప్పు పొందడమే నాకు ఇష్టం’’ అంటున్నారు కథానాయిక కృతీసనన్‌. మహేశ్‌బాబు ‘వన్‌: నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్‌’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి ఆఫర్లను చేజిక్కించుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారే ప్రయత్నాల్లో ఉన్నారు. తాను నటిగా నిరూపించుకున్న విషయం గురించి మాట్లాడుతూ ..‘‘బరేలీ కీ బర్ఫీ’ (2017) సినిమా విడుదలకు ముందు నన్ను అందరూ గ్లామర్‌ పాత్రలే చేయగలదన్నారు. కానీ ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఆ ముద్రను చెరిపేసింది. నాకు మంచి ప్రశంసలు దక్కాయి. అవకాశాలు పెరిగాయి. నన్ను కేవలం ఒక గ్లామరస్‌ హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నాలోని నటిని కూడా ప్రేక్షకులు గుర్తించారు. నా కెరీర్‌లో ఈ సినిమా ఓ కీలకమైన మలుపును తీసుకొచ్చిందని చెప్పగలను’’ అని చెప్పుకొచ్చారు కృతీ. ‘అర్జున్‌ పటియాలా’, ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రాల షూటింగ్స్‌ను కంప్లీట్‌ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ‘పానిపట్‌’ అనే పీరియాడికల్‌ సినిమాతో బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement