న్యూ ఇయర్‌.... న్యూ లెర్నింగ్స్‌ | Arjun Kapoor shares pictures of him learning horse riding | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌.... న్యూ లెర్నింగ్స్‌

Published Sun, Jan 6 2019 2:44 AM | Last Updated on Sun, Jan 6 2019 2:44 AM

Arjun Kapoor shares pictures of him learning horse riding - Sakshi

అర్జున్‌ కపూర్‌

... అంటున్నారు బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌. అశుతోష్‌ గోవారీకర్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘పానిపట్‌’. సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కృతీసనన్‌ కథానాయిక. ఈ సినిమా షూటింగ్‌ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్‌ వేశారు టీమ్‌. ఒకవైపు షూటింగ్‌లో పాల్గొంటూ ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నారు అర్జున్‌. ‘‘గతేడాది డిసెంబర్‌ చాలా సంతోషంగా గడిచింది. ‘పానిపట్‌’ సినిమా షూటింగ్‌లో మళ్లీ పాల్గొంటున్నాను. ఇప్పుడీ సినిమా కోసం గుర్రపుస్వారీని మరింత బాగా నేర్చుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు అర్జున్‌ కపూర్‌. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక అర్జున్‌ కపూర్‌ వ్యక్తిగత విషయానికొస్తే.. బాలీవుడ్‌ నటి మలైకా అరోరా ఖాన్‌తో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement