మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌ను టార్గెట్ చేసిన మంత్రి.. ఆమెపై మరోసారి ప్రతీకారం తీర్చుకున్నారు. తన మీటింగ్‌కు గైర్హారయ్యారన్న కోపంతో ఆమెను మరోసారి బదిలీ చేయించారు. హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఛండీగఢ్: ఈ నెల 30వ తేదీన మంత్రి అనిల్ విజ్ నేతృత్వంలో పానిపట్‌లో ఓ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బందోబస్తు కల్పించాల్సిందిగా పానిపట్ ఎస్పీ సంగీత కాలియాకు మంత్రి కార్యాలయం నుంచి లేఖ అందింది. అయితే ఆమె మాత్రం ఆ ఆదేశాలను పాటించలేదు.. గైర్హాజరయ్యారు. దీంతో రగిలిపోయిన అనిల్ ఆమెను బదిలీ చేయించాలని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను గురుగ్రామ్‌లోని భోండ్సిలోని రిజర్స్ బెటాలియన్‌కు కమాండంట్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంగీత అసంతృప్తి వెల్లగక్కటంతో.. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల సంఘం ఆమె బాసటగా నిలిచింది. మంత్రి తీరు, అప్రాధాన్యం ఉన్న పోస్టుకు ఆమెను బదిలీ చేయటాన్ని ఖండిస్తూ సీఎంవోకు ఓ లేఖ రాసింది. అయితే అధికారులు మాత్రం ఆ వాదనను ఖండించారు. ‘ఆమెను ప్రత్యేకంగా ఏం బదిలీ చేయలేదని, రాష్ట్రంలో మరికొందరు ఐపీఎస్‌లతోపాటే ఆమె బదిలీ జరిగిందని’ చెబుతున్నారు.
కాగా, మూడేళ్ల క్రితం సంగీత ఫతేబాద్ ఎస్పీగా ఉన్న సమయంలో ఇదే అనిల్ విజ్ ఆమెను బదిలీ చేయించారు. ఓ సమావేశంలో ప్రతిపక్షాల నినాదాలతో గందరగోళం నెలకొనగా, తన ఆదేశాలను పాటించలేదన్న కోపంతో ఊగిపోయిన అనిల్.. తర్వాత సంగీతను ట్రాన్స్‌ఫర్ చేయించారు. అప్పట్లో ఆ వీడియో వైరల్‌గా అయ్యింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment