sp transfer
-
వికారాబాద్ ఎస్పీపై బదిలీ వేటు
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు పడింది. ఆమెను బదిలీ చేయాల ని ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. దీంతో వెంటనే ఆమె హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల ని ఆదేశిస్తూ డీజీపీ ఉత్తర్వులి చ్చారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆయన స్వగృహంలో అర్ధరాత్రి సమయంలో బలవం తంగా అరెస్టు చేయడాన్ని తప్పుపడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ జాతీయ నాయకులు కపిల్ సిబాల్ తదితరులు ఫిర్యాదు చేశారు. అరెస్టు చట్టవిరుద్ధం అంటూ రేవంత్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు కూడా ఈ విషయంపై వివరణివ్వాలని డీజీపీ ని ఆదేశించిన సంగతి తెలిసిందే. రేవంత్ అరెస్టు వ్యవహారంలో అ న్నపూర్ణ అత్యుత్సాహం ప్రదర్శించారని, అవసరం లేకున్నా ఆయనను అరెస్టు చేసినందుకు ఆమెను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులను ఆమెకు అప్పగించరాదని కమిషన్ ఆదేశించింది. కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతి... వికారాబాద్ జిల్లా కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతిని నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ వేటుపడిన ఎస్పీ అన్నపూర్ణ స్థానంలో ఆయనను నియమించా రు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. -
‘నేనొక మంత్రిని.. పిలిస్తే రావా?’
మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌ను టార్గెట్ చేసిన మంత్రి.. ఆమెపై మరోసారి ప్రతీకారం తీర్చుకున్నారు. తన మీటింగ్‌కు గైర్హారయ్యారన్న కోపంతో ఆమెను మరోసారి బదిలీ చేయించారు. హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఛండీగఢ్: ఈ నెల 30వ తేదీన మంత్రి అనిల్ విజ్ నేతృత్వంలో పానిపట్‌లో ఓ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బందోబస్తు కల్పించాల్సిందిగా పానిపట్ ఎస్పీ సంగీత కాలియాకు మంత్రి కార్యాలయం నుంచి లేఖ అందింది. అయితే ఆమె మాత్రం ఆ ఆదేశాలను పాటించలేదు.. గైర్హాజరయ్యారు. దీంతో రగిలిపోయిన అనిల్ ఆమెను బదిలీ చేయించాలని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను గురుగ్రామ్‌లోని భోండ్సిలోని రిజర్స్ బెటాలియన్‌కు కమాండంట్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంగీత అసంతృప్తి వెల్లగక్కటంతో.. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల సంఘం ఆమె బాసటగా నిలిచింది. మంత్రి తీరు, అప్రాధాన్యం ఉన్న పోస్టుకు ఆమెను బదిలీ చేయటాన్ని ఖండిస్తూ సీఎంవోకు ఓ లేఖ రాసింది. అయితే అధికారులు మాత్రం ఆ వాదనను ఖండించారు. ‘ఆమెను ప్రత్యేకంగా ఏం బదిలీ చేయలేదని, రాష్ట్రంలో మరికొందరు ఐపీఎస్లతోపాటే ఆమె బదిలీ జరిగిందని’ చెబుతున్నారు. కాగా, మూడేళ్ల క్రితం సంగీత ఫతేబాద్ ఎస్పీగా ఉన్న సమయంలో ఇదే అనిల్ విజ్ ఆమెను బదిలీ చేయించారు. ఓ సమావేశంలో ప్రతిపక్షాల నినాదాలతో గందరగోళం నెలకొనగా, తన ఆదేశాలను పాటించలేదన్న కోపంతో ఊగిపోయిన అనిల్.. తర్వాత సంగీతను ట్రాన్స్ఫర్ చేయించారు. అప్పట్లో ఆ వీడియో వైరల్‌గా అయ్యింది కూడా. -
సీఐ ఆత్మహత్య.. ఎస్పీ బదిలీ
పోలీసు స్టేషన్లోనే ఒక సీఐ ఆత్మహత్య చేసుకోవడంతో ఇందుకు బాధ్యుడిగా భావించిన ఎస్పీని జార్ఖండ్ ప్రభుత్వం బదిలీ చేసింది. గత నెలలో ఉమేష్ కొచ్చప్ అనే సీఐ తన స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో మో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన సర్కారు, ధన్‌బాద్ జిల్లా ఎస్పీ సురేంద్రకుమార్ ఝాను బదిలీ చేసింది. డీఎస్పీ మజ్రుల్ హుడా, స్టేషన్ ఇన్చార్జి సంతోష్ కుమార్ రజాక్‌లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై నియమించిన ద్విసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. బగ్మారా డీఎస్పీ, హరిహర్‌పూర్ స్టేషన్ ఇన్చార్జి ఈ కేసులో దోషులనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, అందుకే వారిని సస్పెండ్ చేశామని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. వారిద్దరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సీఐడీ విభాగం ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని తెలిపారు. జూన్ నెలలో ధన్‌బాద్ జిల్లాలో ఒక ట్రక్కు డ్రైవర్ కాల్చివేత కేసును ఉమేష్ విచారించారు. ఈ కేసును నీరుగార్చేందుకు ఉన్నతాధికారులు ఆయనపై ఒత్తిడి తెచ్చారని, అది తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నారని కథనాలు వచ్చాయి. -
జిల్లా ఎస్పీ బదిలీ
నూతన ఎస్పీగా డాక్టర్ గజరావు భూపాల్ నెల్లూరు(క్రైమ్): జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ గ్రూప్ కమాండర్ గ్రేహౌండ్స్, హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డీజీ వీఆర్‌లో ఉన్న డాక్టర్ గజరావు భూపాల్‌ను నియమిస్తూ బుధవారం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది ఎస్పీలను బదిలీచేశారు. అందులో భాగంగా ఎస్పీ సెంథిల్‌కుమార్ బదిలీ అయ్యారు. 38వ జిల్లా ఎస్పీగా సెంథిల్‌కుమార్ గతేడాది జూలై 30న బాధ్యతలు స్వీకరించారు. 8 నెలల పాటు ఎస్పీగా కొనసాగారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి జిల్లాలో అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. వరుస దాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అంతర్జాతీయ స్మగ్లర్ మూసా అరెస్ట్‌లో కీలకభూమిక పోషించారు. విధి నిర్వహణలో అలసత్వం, అవినీతి, అక్రమాలకు పాల్పడిన పలువురు సిబ్బందిపై కఠినచర్యలు తీసుకొన్నారు. దీంతో జిల్లా పోలీసుశాఖలో అవి నీతి, అక్రమాలకు పాల్పడితే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవన్న సంకేతాన్ని పంపారు. పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి తొలిసారిగా వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు తమ సమస్యలను ఉన్న ప్రాంతం నుంచే ఫిర్యాదు చేసేందుకు స్పందన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాలు సఫలీకృతమయ్యాయి. ప్రధానంగా ఎర్రచందనం, బియ్యం, ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు కృషిచేయడంతో పాటు భారీగా కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న కొందరు అటవీశాఖ సిబ్బందిపైనా కేసులు నమోదు చేయడం, జాక్‌పాట్ లారీలపై ఉక్కుపాదం మోపడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఒక దశలో అప్పటి అటవీశాఖ అధికారి ఎస్పీ వ్యవహారశైలిపై బహిరంగ విమర్శలు చేసిన విషయం విదితమే. రాజకీయాలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో ముందుకు వెళ్లారు. దీంతో రాజకీయ నాయకులు ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీ వ్యవహారశైలిపై ఆది నుంచే అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బహిరంగంగానే ఎస్పీపై విమర్శలు గుప్పించడంతో పాటు ఎస్పీని బదిలీ చేయిస్తామన్నారు. ఎస్పీ తమకు ఏ పనిచేయడం లేదని జిల్లాకు చెందిన అధికారపార్టీ నేతలు పలు దఫాలు జిల్లా మంత్రితో పాటు సీఎంకు సైతం ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ బదిలీ జరిగిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అసలు విధులను వదిలివేసి కొసరు విధులకు ప్రాధాన్యమివ్వడంతో జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయన్న విమర్శలను మూటగట్టుకున్నారు. కాకినాడ వాసి : గజరావు భూపాల్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందినవారని తెలిసింది. కాకినాడలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆంధ్రా క్యాడర్ 2008 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. భద్రాచలం, మెదక్ జిల్లాలో ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పదోన్నతిపై ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేశారు. గతేడాది అక్టోబర్‌లో ఆయన డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీ క్యాడర్‌కు ఆయన వచ్చారు. ఏపీ క్యాడర్లో తొలిసారిగా జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో రాజీలేని వ్యక్తిగా ఆయనకు పేరుంది. -
ఎస్పీ బదిలీకి బ్రేక్
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి బదిలీ వ్యవహారం ఉత్కంఠకు తెరపడింది. ఈయనను హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా బదిలీ చేసి రమేష్ నాయుడును జిల్లా ఎస్పీగా నియమిస్తూ గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అయితే కర్నూలులో బాధ్యతలు చేపట్టి మూడున్నర మాసాలు గడవక మునుపే నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ ఎస్పీ కేంద్ర ప్రభుత్వ ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఎలాంటి ఆరోపణలు లేని ఐపీఎస్ అధికారిని రెండేళ్లలోపు బదిలీ చేయరాదనే నిబంధన నేపథ్యంలో క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ప్రకాషింగ్ కమిటీ, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బదిలీ ఉండాలని క్యాట్‌లో ఎస్పీ తన వాదనను వినిపించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కారణాలను వెల్లడించకపోవడంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రఘురామిరెడ్డినే ఎస్పీగా కొనసాగించాలని క్యాట్ ఆదేశించింది. ఎస్పీ బదిలీ నేపథ్యంలో సంబరాలు చేసుకున్న సొంత శాఖలోని ఆయన వ్యతిరేకులు, కొందరు రాజకీయ నాయకులు తాజా తీర్పును జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. -
న్యాయ పోరాటం
కర్నూలు, న్యూస్‌లైన్: నిజాయితీ.. నిరంకుశత్వం మధ్య పోరాటం కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి బదిలీ మరో రెండు వారాలు వాయిదా పడింది. శాంతి భద్రతల పరిరక్షణకు నిబద్ధతతో పని చేస్తున్న ఆయనను స్వార్థ రాజకీయాలు బదిలీతో సన్మానించడం తెలిసిందే. అయితే కర్నూలులో బాధ్యతలు తీసుకొని మూడున్నర మాసాలు గడవక మునుపే నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ ఎస్పీ క్యాట్‌ను ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశించింది. ఆ మేరకు ఆయన సమర్థవంతమైన అధికారి అయినందునే హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా బదిలీ చేసినట్లు ప్రభుత్వం బుధవారం నివేదించింది. అందుకు క్యాట్ సంతృప్తి చెందకపోగా కర్నూలు జిల్లాకు సమర్థుడైన అధికారి అవసరం లేదా అంటూ ప్రశ్నించింది. బదిలీకి స్పష్టమైన కారణాలను తెలపాలని కోరింది. అందుకు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరడంతో అప్పటి వరకు ఎస్పీని కర్నూలులోనే కొనసాగించాలని క్యాట్ ఆదేశించింది. ఇదిలాఉండగా రఘురామిరెడ్డి జిల్లాను వదిలి వెళుతున్నారని ఇప్పటి వరకు సంబరాలు చేసుకున్న సొంత శాఖలోని ఆయన వ్యతిరేకులకు ఈ విషయం మింగుడుపడటం లేదు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కూడా ఎస్పీ బదిలీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫలితంగా ఈ విషయం అధికార పార్టీని కుదిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీలో ఇరువురు మంత్రుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. తనను మాట మాత్రం కూడా సంప్రదించకుండా ఓ జిల్లా స్థాయి అధికారిని బదిలీ చేయడం పట్ల ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ‘‘ఆయన బాగానే పని చేస్తున్నారు కదా.. ఎందుకు బదిలీ చేయాలి. మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతా’నంటూ సన్నిహితులతో కోట్ల అన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఎస్పీకి మద్దతుగా మూడు రోజుల నుంచి ప్రజలు, ప్రజాసంఘాలు అండగా నిలుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా క్యాట్‌లో తీర్పు వచ్చిన విషయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
రఘు‘రాముడే’
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి రాజకీయ బదిలీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆయన బదిలీని తప్పుపడుతున్నాయి. కుల, విద్యార్థి, యువజన సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. సొంత శాఖ ప్రక్షాళనపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి అవసరమైతే ఇంటికి పంపేందుకూ వెనుకాడబోనని ఘాటుగా హెచ్చరించారు. పేరు మోసిన ఫ్యాక్షనిస్టులకు కౌన్సెలింగ్ ఇస్తూ గీత దాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. రఘురామిరెడ్డి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతలు గాడిలో పడ్డాయి. రౌడీలు, ఫ్యాక్షనిస్టుల్లో వెన్నులో వణుకు పట్టించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ప్రజల్లో నమ్మకం కల్పించారు. మీతో మీఎస్పీ కార్యక్రమం ప్రవేశపెట్టి ఆపన్నులకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేత స్వార్థానికి ఆయనకు బదిలీ కావడం పట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి అధికారులను కాపాడుకోవాల్సింది పోయి ఈ తీరున వ్యవహరించడం తగదన్నారు. నంద్యాలలోనూ వివిధ ప్రజా సంఘాలు ఎస్పీ బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంలో ఎస్పీ విఫలమయ్యారని అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పలు ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని బన్ని ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల రక్షణకు మొదటి సారిగా హెల్మెట్లు కూడా ఆయన పంపిణీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. ఇదిలాఉండగా తన బదిలీని నిలిపివేయాలంటూ ఎస్పీ రఘురామిరెడ్డి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. పిటిషన్ విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్) రఘురామిరెడ్డి బదిలీని నిలిపివేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం కొందరు పోలీసు అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది.