సీఐ ఆత్మహత్య.. ఎస్పీ బదిలీ | SP transferred over police officer's suicide | Sakshi
Sakshi News home page

సీఐ ఆత్మహత్య.. ఎస్పీ బదిలీ

Published Fri, Jul 15 2016 8:29 PM | Last Updated on Sat, Aug 11 2018 8:16 PM

SP transferred over police officer's suicide

పోలీసు స్టేషన్లోనే ఒక సీఐ ఆత్మహత్య చేసుకోవడంతో ఇందుకు బాధ్యుడిగా భావించిన ఎస్పీని జార్ఖండ్ ప్రభుత్వం బదిలీ చేసింది. గత నెలలో ఉమేష్ కొచ్చప్ అనే సీఐ తన స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో మో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన సర్కారు, ధన్బాద్ జిల్లా ఎస్పీ సురేంద్రకుమార్ ఝాను బదిలీ చేసింది. డీఎస్పీ మజ్రుల్ హుడా, స్టేషన్ ఇన్చార్జి సంతోష్ కుమార్ రజాక్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై నియమించిన ద్విసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ చర‍్యలు తీసుకున్నారు.

బగ్మారా డీఎస్పీ, హరిహర్పూర్ స్టేషన్ ఇన్చార్జి ఈ కేసులో దోషులనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, అందుకే వారిని సస్పెండ్ చేశామని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. వారిద్దరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సీఐడీ విభాగం ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని తెలిపారు. జూన్ నెలలో ధన్బాద్ జిల్లాలో ఒక ట్రక్కు డ్రైవర్ కాల్చివేత కేసును ఉమేష్ విచారించారు. ఈ కేసును నీరుగార్చేందుకు ఉన్నతాధికారులు ఆయనపై ఒత్తిడి తెచ్చారని, అది తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నారని కథనాలు వచ్చాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement