Jharkhand police
-
స్మగ్లింగ్ మాఫియా దారుణం.. మహిళా ఎస్సైని లారీతో తొక్కించి హత్య
రాంచీ: హర్యానా మైనింగ్ మాఫియా చేతిలో హత్యకు గురయ్యారు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో దారణం చోటు చేసుకుంది. డీఎస్పీ హత్య తరహాలోనే ఓ మహిళా ఎస్సైని వాహనంతో తొక్కించి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం రాత్రి జరిగింది. రాంచీ నగరంలోని టుపుదానా ఔట్‌పోస్ట్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య టోప్నే. రోజులాగే వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ వాహనంతో వేగంగా దూసుకొచ్చి ఎస్సైని తొక్కించారు. ‘పశువులను తరలిస్తున్నారని ఎస్సైకి సమాచారం అందింది. ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించారు. దాంతో ఎస్సైని ఢీకొట్టాడు డ్రైవర్. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశాం. ’అని సీనియర్ ఎస్పీ కౌశల్ కిశోర్ తెలిపారు. హర్యానాలోని నూహ్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ డీఎస్పీ ర్యాంక్ అధికారిని మైనింగ్ మాఫియా హత్య చేసిన కొన్ని గంటల్లోనే మహిళా ఎస్సై హత్య జరగటం కలకలం సృష్టించింది. డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ హత్య కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: Haryana DSP Murder: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
ఆర్థికవేత్త జీన్ డ్రేజ్ అరెస్ట్
సాక్షి, రాంచీ: ప్రమఖ ఆర్థికవేత్త, విద్యావేత్త, హక్కుల కార్యకర్త జీన్ డ్రేజ్ను ఈ రోజు ఉదయం జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు అనుమతుల్లేకుండా ప్రజా సభ నిర్వహించినందుకు ఆయనను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. డ్రేజ్తోపాటు మరో ఇద్దరు కూడా అరెస్టయ్యారు. తర్వాత వీరిని పోలీసులు వదిలేశారని సమాచారం. ఈ అరెస్ట్‌ను ఖండించిన వ్యవసాయ కార్యకర్త, రాజకీయ నాయకుడు యోగేంద్ర యాదవ్ స్పందిస్తూ.. ‘తనకున్న పేరు, ప్రఖ్యాతులను వదిలేసి.. భారత పౌరసత్వం తీసుకొని, ఇక్కడి మురికివాడల్లోని పేద ప్రజలతో కలిసి నివసిస్తున్నారు జీన్ డ్రేజ్. అలాంటి ఆయనను అరెస్ట్ చేయడం సిగ్గుచేట’ని అన్నాడు. డ్రేజ్ది బెల్జియన్ దేశం. హక్కుల కార్యకర్తగా ఆకలి కేకలను వివరించే హంగర్ అండ్ పబ్లిక్ యాక్షన్ అనే పుస్తకాన్ని, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్తో కలసి డ్రేజ్ రాశారు. ప్రస్తుతం ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డ్రేజ్ ఇంతకు ముందు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బోధించారు. -
సీఐ ఆత్మహత్య.. ఎస్పీ బదిలీ
పోలీసు స్టేషన్లోనే ఒక సీఐ ఆత్మహత్య చేసుకోవడంతో ఇందుకు బాధ్యుడిగా భావించిన ఎస్పీని జార్ఖండ్ ప్రభుత్వం బదిలీ చేసింది. గత నెలలో ఉమేష్ కొచ్చప్ అనే సీఐ తన స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో మో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన సర్కారు, ధన్‌బాద్ జిల్లా ఎస్పీ సురేంద్రకుమార్ ఝాను బదిలీ చేసింది. డీఎస్పీ మజ్రుల్ హుడా, స్టేషన్ ఇన్చార్జి సంతోష్ కుమార్ రజాక్‌లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై నియమించిన ద్విసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. బగ్మారా డీఎస్పీ, హరిహర్‌పూర్ స్టేషన్ ఇన్చార్జి ఈ కేసులో దోషులనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, అందుకే వారిని సస్పెండ్ చేశామని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. వారిద్దరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సీఐడీ విభాగం ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని తెలిపారు. జూన్ నెలలో ధన్‌బాద్ జిల్లాలో ఒక ట్రక్కు డ్రైవర్ కాల్చివేత కేసును ఉమేష్ విచారించారు. ఈ కేసును నీరుగార్చేందుకు ఉన్నతాధికారులు ఆయనపై ఒత్తిడి తెచ్చారని, అది తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నారని కథనాలు వచ్చాయి. -
సినిమా చూపిస్తా మామ...
రాంచి: ప్రభుత్వ వ్యవస్థకు, అందులో భాగమైన పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా ఇంతకాలం మావోయిస్టులు లేదా మావో సానుభూతిపరులు సినిమాలు తీస్తూ వచ్చారు. భారత్‌లోని మావోయిస్టుల్లో సామాజిక మార్పు తీసుకరావడానికి పోలీసులే మావోయిస్టులపై తొలిసారిగా సినిమా తీశారు. ఇదో విశేషమైతే దాదాపు డజను మంది నిజమైన పోలీసు అధికారులే ఇందులో నటించడం మరో విశేషం. మావోయిస్టుల ప్రభావం నుంచి ప్రజలను తప్పించడంలో భాగంగా వారితో మమేకమయ్యేందుకు ఇప్పటివరకు పోలీసులు చాలా వేశాలే వేశారు. ముఖ్యంగా మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉన్న జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రల్లో ప్రజలతో కలసి ఆటల పోటీల్లో పాల్గొన్నారు. మావోయిస్టుల ప్రభావం నుంచి ప్రజలను దూరం చేసేందుకు నాటకాలు, రూపకాలు వేశారు. ఇప్పుడు నేరుగా మావోయిస్టులనే ప్రభావితం చేసి హింసామార్గాన్ని వదిలిపెట్టి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకరావడానికి వారినే ఇతివృత్తంగా చేసుకొని సినిమా తీశారు. ‘ప్రత్యవర్తన్ ’(హోం కమింగ్-ట్యాగ్) టైటిల్‌తో జార్ఖండ్ పోలీసులు తీసిన ఈ చిత్రంలో జార్ఖండ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు పలువురితోపాటు మాజీ డీజీపీ రాజీవ్ కుమార్ సినిమాలో డీజీపీగా నటించారు. స్థానిక మల్టీప్లెక్స్‌లో గురువారం సాయంత్రం ఈ చిత్రం ప్రీమియర్ ప్రదర్శించారు. ప్రజల వీక్షణ కోసం నవంబర్ 13వ తేదీన విడుదల చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతం నుంచి మావోయిస్టులు గాడి తప్పుతున్నారని భావిస్తున్న ఓ మావోయిస్టు జోనల్ కమాండర్ జీవితం చుట్టూ చిత్రం కథ నడుస్తుంది. ఎన్నో మలుపులు ఉండే ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఓ ప్రేమ కథను కూడా జోడించారు. ఓ మావోయిస్టు యువకుడు రేప్‌కు గురవుతున్న ఓ అమ్మాయిని రక్షించి ఆమెకు దగ్గరవుతాడు. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలనే తన నాయకుల అంచనాలకు, ప్రేమకు మధ్య నలిగిపోతాడు. జనజీవన స్రవంతిలోకి తీసుకరావడం కోసం మావోయిస్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఓ సినిమా తీయాలనే ఆలోచన జార్ఖండ్ డీజీపీగా ఉన్నప్పుడు రాజీవ్ కుమార్‌కు 2013లోనే వచ్చింది. ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది. నిమూ భౌమిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ సింగర్ షాన్ ఇంపైన పాటలు పాడారు.శ్రీల మజుందార్, మౌసమీ భట్టాచార్య, ఇషాన్, సైకత్ ఛటర్జీ తదితరులు కూడా నటించారు. -
తారా భర్తకు మూడు రోజుల రిమాండ్!
న్యూఢిల్లీ: జాతీయ స్థాయి షూటర్ తారా షాడియో భర్త రంజీత్ సింగ్ కోహ్లీ అలియాస్ రాకిబుల్ హాసన్ ఖాన్ కు మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ కు తరలించాలని జార్ఖండ్ పోలీసులకు స్థానిక కోర్టు ఆదేశించింది. తారా షాడియో, రంజిత్ కోహ్లీ వివాహం ఇటీవల జరిగింది. అయితే తనను ఇస్తాం మతానికి మారాలంటూ వేధింపులకు గురిచేస్తూ.. తన కోట్టారని తారా ఇచ్చిన ఫిర్యాదు మేరుకు రంజిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్య విచారణ చేపట్టిన చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ సతీష్ కుమార్ ఆరోరా.. కోహ్లీ, అతని తల్లికి మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించాలని జార్ఖండ్ పోలీసులు ఆదేశించారు. -
'గిరిరాజ్ తప్పించుకు తిరిగితే, ఆస్తులను జప్తు చేస్తాం'
పాట్నా: కోర్టు ఆదేశాలతో బీహార్, జార్ఖండ్ పోలీసులు బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు నివాసంపై సోదాలు నిర్వహించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో గిరిరాజ్ పై బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో బొకారో, పాట్నా పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే దాడుల నిర్వహించిన సమయంలో గిరిరాజ్ ఆచూకీ లభ్యం కాలేదని పాట్నా సిటి సూపరింటెండెంట్ పోలీస్ జయకాంత్ తెలిపారు. జార్ఖండ్ పోలీసులు నగరంలో ఉన్నారని.. పాట్నా పోలీసుల బృందం సహకారంతో గిరిరాజ్ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జయకాంత్ తెలిపారు. గిరిరాజు లొంగుబాటుకు ముందే అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఆయన తప్పించుకు తిరిగితే.. కోర్టు సహాయంతో గిరిరాజ్ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు. -
బుద్ధగయ, పాట్నా పేలుళ్ల మధ్య పోలిక
బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం సంభవించిన వరుస బాంబు పేలుళ్లు, ఈ ఏడాది జులైలో బుద్ధగయలో చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్లు ఒకేలా ఉన్నాయని జార్ఖండ్ పోలీసు ఉన్నతాధికారి ఎస్.ఎన్. ప్రధాన్ వెల్లడించారు. ఇరు ప్రాంతాలలో జరిగిన బాంబు పేలుళ్లలో వాడిని టైమర్లు ఒకటేనని తమ దర్యాప్తులో వెల్లడైందని, అలాగే ఆ పేలుళ్ల వెనక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని తమ ప్రాధమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. అయితే పాట్నాలో వరుస బాంబు పేలుళ్ల జరిగినప్పుడు ప్రజలు తీవ్ర ఆందోళనతో నలువైపులకు పరుగులు తీశారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో చాలా సాక్ష్యాలు కనుమరుగు అయ్యాయని తెలిపారు. ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హుంకార్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి కొన్ని గంటల ముందు పాట్నాలో పలు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనలో పలువు మరణించారు. అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే.