
గుర్రపు స్వారీ చేయడం కథానాయిక కృతీసనన్‌కు కొత్త కాదు. హిందీ చిత్రం ‘రాబ్తా’ కోసం ఆమె హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ రైడింగ్ స్కిల్స్‌కు మరింత పదునుపెట్టి రైడింగ్ స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. ఎందుకంటే íపీరియాడికల్ మూవీ ‘పానీపట్’ కోసం. అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో సంజయ్ దత్, అర్జున్ కపూర్, కృతీసనన్, కబీర్ బేడి ముఖ్య తారలుగా రూపొందుతోన్న సినిమా ఇది. ఇందులో అర్జున్ కపూర్ రెండో భార్యగా నటిస్తున్నారు కృతీ.
ఈ సినిమాలోని తన పాత్ర కోసమే ఛల్ ఛల్ అంటూ మళ్లీ హార్స్ రైడింగ్ చేస్తున్నారు. ‘‘ప్రస్తుతం నేను నటిస్తోన్న ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలోనూ హార్స్ రైడింగ్ సీక్వెన్స్ ఉంది. ఈ సీన్స్ నాకు ఎగై్జటింగ్‌గా అనిపించాయి. అలాగే ఇప్పుడు ‘పానీపట్’ సినిమా కోసం గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇందులో మరాఠీ వారియర్‌గా కనిపిస్తాను. గతంలో కంటే ఇప్పుడు బాగా హార్స్ రైడింగ్‌పై కంట్రోల్ వచ్చింది’’ అన్నారు కృతి.
Comments
Please login to add a commentAdd a comment