ప్రజెంట్ బాలీవుడ్ సెన్సేషన్‌గా నిలిచాడు హీరో కార్తిక్ ఆర్యన్. వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తిక్ తాజాగా ‘లుకా చుప్పా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో ఓ టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు కార్తిక్. అదేంటంటే.. తొలిసారి స్క్రీన్ మీద తాను హీరోయిన్‌ను ముద్దు పెట్టుకోవడం చూసి కార్తిక్ తల్లి ఏడ్చేశారట.
ఈ విషయం గురించి కార్తిక్ మాట్లాడుతూ.. ‘మా అమ్మ, అమ్మమ్మ ఆన్‌స్ర్కీన్ మీద నా ప్రవర్తన చూసి చాలా బాధపడ్డారు. అయ్యో వీడు చదువును గాలికొదిలేసి పనికిమాలిన వేశాలు వేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను స్క్రీన్ మీద హీరోయిన్‌ను ముద్దు పెట్టుకోవడం చూసి మా అమ్మ ఏడ్చేసింది’ అంటూ చెప్పుకొచ్చారు. కార్తిక్ నటించిన ‘సోను కే టిటూ కీ స్వీటి’ బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాక రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. త్వరలోనే కార్తిక్ ఇంతియాజ్ అలీ చిత్రంలో నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment