కాస్టింగ్ కౌచ్.. ఆ అనుభవం కాలేదు
కాస్టింగ్ కౌచ్.. ఆ అనుభవం కాలేదు
Published Sun, Sep 17 2017 12:28 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
సాక్షి, సినిమా: మళయాళ నటి భావన అపహరణ, లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగు చూశాక పలువురు నటీమణులు అమెకు సంఘీభావం ప్రకటిస్తూనే.. సినీ పరిశ్రమ అంటేనే అవి తప్పవన్నట్లు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ లాంటి అనుభవం తామూ ఎదుర్కున్నామని, కెరీర్‌లో రాణించాలంటే ఆ మాత్రం సర్దుకుపోవాలని మరికొందరు ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అయితే తనకు అలాంటి అనుభవం ఏనాడూ ఎదురు కాలేదని చెబుతోంది హీరోయిన్ కృతి సనన్.
మహేష్ బాబు వన్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ మధ్యే ఆమె నటించిన బరేలీకి బర్ఫీ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్ ఫ్యాన్‌గా కృతి నటించింది. ఇక ఇండియా టుడే మైండ్ రాక్స్ యూత్ సదస్సుకు హాజరైన కృతి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
‘నేనొక ఇంజనీర్‌ను. హీరోయిన్ కావాలన్న నా కల చాలా పెద్దదిగా అనిపించింది. అప్పుడే కాస్టింగ్ కౌచ్ గురించి గుర్తొచ్చింది. అవకాశాల పేరిట హీరోయిన్లను కొందరు వాడుకోవటం అనే దౌర్భాగ్యకరమైన సంస్కృతి అన్ని భాషల్లో తప్పదనే తెలుసుకున్నా. ఈ క్రమంలో నాపై కూడా వేధింపులు తప్పవేమోనని భావించా. కానీ, ఇప్పటిదాకా ఎక్కడా నాకు అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. ఓ ఏజెన్సీ ద్వారానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చా.. ప్రస్తుతం కూడా అలాగే కెరీర్‌లో ముందుకు సాగుతున్నా. ఇదంతా నా అదృష్టమే’ అని కృతి చెబుతోంది. ఇదే వేదికపై సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా తన జైలు జీవితం, హీరోయిన్లతో అఫైర్లు.. తదితర అనుభవాలను పంచుకున్న విషయం తెలిసిందే.
Advertisement