
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విద్యా బాలన్, త్రిప్తి డిమ్రీ, మాధురి దీక్షిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే హీరో కార్తీక్ ఆర్యన్‌కు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని ఏకంగా ఆయనకు ప్రపోజ్ చేసింది. కార్తీక్ ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరు కాగా.. ఉహించని విధంగా ఓ అభిమాని సాంగ్ పాడి మరీ అతనికి ప్రపోజ్ చేసింది. ఈ సంఘటనతో ఆశ్చర్యానికి గురైన కార్తీక్.. తన మొత్తం ఫిల్మోగ్రఫీని ఒక్క కవితలో ఆలోచనాత్మకంగా చేప్పినందుకు అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment