
బీరుట్:లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మిలిటెంట్ గ్రూపు హమాస్‌కు చెందిన కీలక నేత మృతి చెందినట్లు సమాచారం. ఉత్తర లెబనాన్ ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల క్యాంపుపై ఇజ్రాయెల్ తాజాగా వైమానిక దాడులు జరిపింది.
ఈ దాడుల్లో హమాస్‌కు చెందిన అల్ ఖసమ్ బ్రిగేడ్ లో సభ్యుడైన సయీద్ అతల్లా మృతి చెందాడు. దాడుల్లో అతల్లాతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మీడియా ఈ విషయాలను వెల్లడించింది.
ఇక,లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 2 వేల మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం.ఇందులో 250 మంది హెజ్‌బొల్లాకు చెందినవారున్నారని కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. అంతకముందు ఇజ్రాయెల్ జరిపిన స్పెషల్ ఆపరేషన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మృతి చెందాడు.
ఇదీ చదవండి: ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి: ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment