
టెల్‌అవీవ్: హమాస్ ఉగ్రవాద సంస్థలో మిగిలిన చివరి కీలక నేతను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(ఐడీఎఫ్) ప్రకటించింది. హమాస్ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కసబ్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ వెల్లడించింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర మిలిటెంట్ గ్రూపులను అతడు సమన్వయం చేస్తున్నాడని ఐడీఎఫ్ తెలిపింది. కారుపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కసబ్ చనిపోయాడని హమాస్ వర్గాలు ధృవీకరించాయి.
కాగా, ఇటీవలే ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడుల సూత్రధారి సిన్వర్‌ను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. అంతకుముందు హమాస్ చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హానియేను కూడా ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. హమాస్‌ను లేకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఉగ్రవాద సంస్థలోని కీలక నేతల ఎలిమినేషన్‌పై ఐడీఎఫ్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్ హై అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment