లయన్‌ 'క్వీన్‌' | Lion And Wild Animals Women Guard Rasila Vadher Special Story | Sakshi
Sakshi News home page

లయన్‌ 'క్వీన్‌'

Published Thu, Aug 13 2020 7:24 AM | Last Updated on Thu, Aug 13 2020 7:24 AM

Lion And Wild Animals Women Guard Rasila Vadher Special Story - Sakshi

సింహం పిల్లకు పాలు పడుతున్న వధేర్‌

పెద్దపులులు, సింహాల మధ్యనే రసీలా వధేర్‌ జీవనం. వన్యప్రాణుల సంతతిని రక్షిస్తూ, చంటిబిడ్డల్లా వాటిని సాకుతున్న 36 ఏళ్ల వధేర్‌ పులులు, సింహాలు, మొసళ్లు, పాములు.. హానికర జంతువులైనా థైర్యంగా వాటిని కాపాడుతుంటుంది. 

భారతీయ అటవీ సేవల అధికారి పర్వీన్‌ కస్వాన్‌ ఇటీవల రసీలా వధేర్‌ గురించి ట్వీట్‌ చేస్తూ  – ‘వన్యప్రాణులను బావుల నుండి, ప్రమాదాల నుండి రక్షించడానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఇప్పటి వరకు 300 సింహాలు, 500 చిరుతపులులు, మొసళ్లు, కింగ్‌ కోబ్రాలు.. ఇలా 1,100కు పైగా జంతువులను రకరకాల ప్రమాదాల నుండి రక్షించింది. మీరు గిర్‌కు వెళ్లినప్పుడు తప్పక వధేరాను కలవంyì . అడవికి రారాజైన సింహం కన్నా నమ్మకంగా అడుగులు వేస్తూ ధైర్యానికి మారుపేరుగా నిలుస్తుంది’ అని ట్వీట్‌ చేశారు. అంతేకాదు, వధేర్‌కు సంబంధించిన నాలుగు ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌. దీంతో మరోసారి వెలుగులోకి వచ్చింది ఈ లయన్‌ క్వీన్‌ అని పేరు తెచ్చుకున్న రసీలా వధేర్‌.2008లో గుజరాత్‌ గిర్‌ నేషనల్‌ పార్క్‌లో మొదటి మహిళా ఫారెస్ట్‌ గార్డ్‌ నియామకంతో రసీలా వధేర్‌పేరు నాడు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి వధేర్‌ వన్యప్రాణుల పట్ల ప్రేమను, ధైర్యాన్ని చూపుతూనే ఉంది. పనిలో చూపించే శ్రద్ధ, నమ్మకం, ధైర్యం ఇప్పుడు ఆమెను గిర్‌ రెస్క్యూ డిపార్ట్‌మెంట్‌ అధిపతిగా పదోన్నతినిచ్చింది. 

మహిళా గార్డుగా గాయపడిన పెద్ద పులుల పిల్లలను రక్షించడమే కాకుండా, తల్లి లేని జంతు పిల్లలను కూడా రక్షించి సాకుతుంది. వేటగాళ్ల నుంచి జంతువులను కంటికి రెప్పలా కాపాడుతుంది రసీలా వధేర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement