
విరాజ్ రెడ్డి(Viraj Reddy) చీలం, మిమి లియోనార్డ్, శిల్పా ప్రధాన పాత్రధారులుగా జగ పెద్ది దర్శకత్వంలో రూపొందిన హారర్, సస్పెన్స్ అండ్ లవ్ మూవీ ‘గార్డ్’(Guard). ‘రివెంజ్ ఫర్ లవ్’ అనేది ఉప శీర్షిక. అనసూయ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో విరాజ్ రెడ్డి చీలం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని ఏ ఒక్కరూ కొత్త యాక్టర్ అనే ఫీలింగ్ రాదు.
ఆస్ట్రేలియాలోనే మొత్తం చిత్రీకరణ పూర్తి చేశాం. మా డైరెక్టర్, టీమ్ అక్కడే ఉన్నారు. చిన్న చిత్రాలను సపోర్ట్ చేయండి’’ అని అన్నారు. ‘‘గార్డ్’ కేవలం లవ్‌స్టోరీ మూవీయే కాదు... థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి’’ అని తెలిపారు మ్యూజిక్ డైరెక్టర్ ప్రణయ్. ‘‘సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాకు రీ రికార్డింగ్ చేశాను ’’ అన్నారు సిద్ధార్థ్.