
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలు సందర్శించేటప్పుడూ అక్కడ పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలకు సంబంధించిన బోర్డులు ఉంటాయి. పైగా అక్కడ మనకు ఈ వస్తువులను తాకవద్దు అని కూడా రాసి ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది అత్యుత్సహంతో ఎవరికంట పడకుండా ఆ వస్తువులను తాకేందుకు తెగ ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలో ఆ వస్తువు గనుక కిందపడి పగిలిందో ఇక అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఒక చారిత్రత్మక ప్రదేశానికి వెళ్లి ఫోటోలు తీసుకునే క్రమంలో ఊహించని షాకింగ్ ఘటనను ఎదుర్కొంటుంది.
అసలేం జరిగిదంటే....ఒక మహిళ లండన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆమె ప్రసిద్ధిగాంచిన బకింగ్‌హామ్ ప్యాలెస్‌ని సందర్శించింది. అక్కడకు వెళ్లిన ప్రతిఒక్కరూ రకరకాల ఫోజులతో ఫోటోలు తీసుకోవడం సర్వసాధారణం. ఆ క్రమంలోనే ఒక టూరిస్ట్ మహిళ గుర్రం మీద ఉన్న క్వీన్ గార్డుతో కలిసి ఫోటో తీసుకోవాలనుకుంటుంది. అనుకున్నదే తడువుగా ఆ క్వీన్‌గార్డుకి దగ్గరగా నుంచుని ఒక ఫోటో తీసుకుంటోంది. ఐతే ఫోటోలు తీసుకునే క్రమంలో ఆ గుర్రాన్ని తాకేందుకు యత్నించకూడదని హెచ్చరిక బోర్డులు ఉంటాయి.
పైగా అక్కడ ఉన్న సంరక్షణాధికారులు కూడా పర్యాటకులకు ఈ నియమాలు గురించి చెబుతారు. ఐతే సదరు మహిళ అవేమి పట్టించుకోకుండా తనదారి తనది అన్నట్టుగా గుర్రం పై ఉన్న క్వీన్ గార్డుతో కలసి ఫోటో తీసుకుంటున్న నెపంతో ఆ గుర్రాన్ని తాకడమే కాక తనవైపుకు తిప్పుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తుంది. అంతే ఒక్కసారిగా ఆ క్వీన్‌గార్డు బిగ్గరగా అరుస్తూ...గుర్రాన్ని, వాటికి ఉన్న పగ్గాలను తాకొద్దు అంటూ ఆమె పై సీరియస్ అయ్యాడు.
ఈ హఠాత్పరిణామానికి ఆ మహిళ ఒక్కసారిగా తత్తరపాటుకి గురవుతుంది. పైగా ఆ గుర్రం కూడా కాస్త బెదురుగా ముందుకు కదులుతుంది. ఈ ఊహించని ఘటనకు ఆ మహిళ తెగ బాధపడిపోతూ...ఇక లండన్‌కి ఎప్పటికీ రానంటూ శపథం చేసింది. ఈ మేరకు ఈ ఘటన తాలుకా వీడియోని కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ గార్డు చర్యను తప్పుపడితే, మరికొందరూ అక్కడ తాకకుడదని కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టే అతను అలా ప్రవర్తించాడంటూ క్వీన్ గార్డుని సమర్థిస్తూ... రకరకాలుగా ట్వీట్ చేశారు.
He scared me for a moment too. 😂😂pic.twitter.com/6dD8Fmx62q
— Figen (@TheFigen) July 31, 2022
(చదవండి: అనూహ్య ఘటన!. పైలెట్ దూకేశాడా? పడిపోయాడా!)