కొద్ది రోజుల క్రితం హోలీ సెపల్చ్రే చర్చ్ లోని జీసస్ సమాధిపైన పాలరాతిని పరిశోధకులు తొలగించారు. ఆ అద్భుత ఘట్టాన్ని మరువక ముందే హోలీ సెపల్చ్రే కు చెందిన మరో విశేషం వెలుగులోకి వచ్చింది. క్రిస్టియన్లు ఎంతో పవిత్రంగా భావించే ఈ చర్చిని, అందులోని జీసస్ సమాధిని కాపాడేది రెండు ముస్లిం కుటుంబాలు. అవును. వీరిలో ఒకరు జోడేహ్(జెరుసలేంకు చెందిన వారు) కాగా, మరొకరు నుసెబేహ్(పాలస్తీనాకు చెందిన వారు)ల వంశాల వారు.
12వ శతాబ్దం నుంచి ఈ ఇరు వంశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చర్చి ప్రధాన ద్వారాన్ని తెరుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అదీబ్ జౌడేహ్, వాజీహ్ నుసెబేహ్ లు హోలీ సెపల్చ్రే ప్రధాన ద్వారాన్ని తెరుస్తున్నారు. 12 అంగుళాలు ఉండే ప్రధాన ద్వారపు తాళం చెవి వందల ఏళ్లుగా ఇరు కుటుంబాల వద్దే ఉంటోంది. ప్రతి ఉదయం అదీబ్, వాజీహ్ లు తాళం చెవి తీసుకుని వచ్చి మత బోధకులను, రాత్రి పూట చర్చి ప్రాంగణంలో నిద్రించే యాత్రికులను నిద్రలేపుతారు. మరలా తిరిగి రాత్రి 7.30 గంటలకు చర్చి తలుపులు మూసివేస్తారు.
ముస్లింలకు ఈ బాధ్యతలు ఎలా వెళ్లాయి?
ముస్లిం కుటుంబాలకు హోలీ సెపల్చ్రే చర్చి ద్వారాలు తెరిచే అవకాశం ఎలా దక్కిందనే విషయంపై పలు కథలు ఉన్నాయి. సెపల్చ్రే చర్చికి కాపలా కాసే అవకాశం తొలుత నుసెబేహ్ లను వరించింది. ప్రస్తుతం చర్చి ద్వారాలు తెరుస్తున్న వాజీహ్(68) తెలిపిన వివరాల ప్రకారం.. 637 ఏడీలో ముస్లిం రాజు కాలిఫ్ ఒమర్ గెలుపు తర్వాత ఆర్క్ బిషప్ సొఫ్రోనియస్ కు ఓ మాట ఇచ్చారు. అది క్రిస్టియన్ ప్రార్ధనా మందిరాలను తాను కాపాడతానని చెప్పాడు.
ఆ మేరకు తనకు అత్యంత నమ్మకస్తులైన నుసెబేహ్ లను హోలీ సెపల్చ్రే కు రక్షణగా ఉంచారు. మెదీనాకు చెందిన నుసెబేహ్ లు మహమ్మద్ లకు బంధువులవుతారని వాజీహ్ చెప్పారు. 1187వ సంవత్సరంలో జెరుసలేం రాజ్యాన్ని గెలిచిన సలాదిన్ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు తమ కుటుంబాన్ని సెపల్చ్రే చర్చికు కాపలాగా తమ కుటుంబాన్ని తిరిగి ఎంచుకున్నట్లు తెలిపారు.
జౌడేహ్ ల ప్రవేశం
16వ శతాబ్దంలో ఒట్టొమన్ టర్క్ లు జొడేహ్ లను చర్చ్ కు రక్షణగా రెండో కుటుంబంగా తీసుకువచ్చారు. ఈ విషయాన్ని నుసెబేహ్ లతో ప్రస్తావించగా తాము జొడేహ్ లతో చర్చ్ రక్షణను పంచుకుంటామని తెలిపారు. కొద్ది సార్లు ఈ విషయమై కుటుంబాల్లో లాగా చిన్నపాటి వాదులాటలకు కూడా దిగుతామని చెప్పారు.
1187 నుంచి చర్చ్ ప్రధాన ద్వారానికి చెందిన తాళం చెవి తమ కుటుంబం వద్ద ఉంటోందని జోడేహ్ తెలిపారు. క్రిస్టియన్ పవిత్ర స్ధలాల్లో కీలకమైన చర్చ్ కు తాను కాపలాదారుడినైనందుకు చాలా గర్వంగా ఉంటుందని చెప్పారు. ఈ చర్చ్ కింద జీసస్ సమాధి ఉందనే కొన్ని పరిశోధనలు చెప్పాయని తెలిపారు.
విభిన్న కథనం
హోలీ సెపల్చ్రే చర్చ్ ను పలు రకాల క్రిస్టియన్ చర్చ్ లు పంచుకున్నాయి. వీటిలో కేథలిక్, గ్రీక్ ఆర్ధోపొడొక్స్, ఆర్మేనియన్, కాప్టిక్, సిరియాక్, ఇథియోపియన్ ఆర్ధోడాక్స్ లకు చెందినవారు ఉన్నారు. వీరందరూ చర్చ్ రక్షణలో తమకు భాగస్వామ్యం కావాలంటే తమకు కావాలని వాదులాడుకోవడంతో ఆ అవకాశాన్ని ముస్లింలకు ఇచ్చారనే మరో కథ కూడా ఉంది.
జీసస్ సమాధికి కాపలాగా ముస్లింలు
Published Wed, Nov 2 2016 7:01 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
Advertisement
Advertisement