Ranbir Kapoor Alia Bhatt Wedding Hint By Brahmastra Love Poster: బాలీవుడ్ లవ్లీ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-అలియా భట్ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలోని కాశీలో పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వెంటనే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్ర బృందం తాజాగా రణ్‌బీర్, అలియా ప్రేమగా, అతి సన్నిహితంగా ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
చదవండి: ఏప్రిల్‌లోనే అలియా-రణ్‌బీర్ వివాహం !.. ఆ కారణం వల్లే ముహుర్తం
డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ పోస్టర్‌ను షేర్ చేశారు. 'ప్రేమ అంటే కాంతి. బ్రహ్మాస్త్రలోని మొదటి అధ్యాయాన్ని పార్ట్ 1: శివ అని చాలా కాలంగా మనం పిలుస్తున్నాం. కానీ పార్ట్ 1 అంటే ప్రేమ. ఎందుకంటే బ్రహ్మాస్త్ర ప్రధానంశం ప్రేమకు ఉన్న శక్తికి సంబంధించినది. ఈ ప్రేమ అగ్నిలా అన్నివైపులా వ్యాపించి సినిమాను దాటి నిజ జీవితంలోకి అడుగుపెట్టింది. ఇదిగో మా లవ్ పోస్టర్. దీనికి ఇది సరైన సమయం అనిపిస్తుంది.' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు అయాన్ ముఖర్జీ. అయితే రణ్‌బీర్-అలియా వివాహం ఈ నెల 14న జరగనుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు నిజమని చెప్పేలా అయాన్ లవ్ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment