విరాజ్ జె అశ్విన్ హీరోగా టి.ప్రతాప్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా అనగనగా ఓ ప్రేమకథ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఒక్కో పాటను ఒక్కో సినీ ప్రముఖుడి చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు.
ఇప్పటికే లెజెండరీ దర్శకుడు మణిరత్నం, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల చేతుల మీదుగా టీజర్, పాటలను రిలీజ్ చేయించిన చిత్రయూనిట్ తాజాగా మరో పాటు ఓ యువ దర్శకుడి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఇటీవల గీత గోవిందం సినిమాతో ఘన విజయం అందుకున్న పరుశురాం చేతుల మీదుగా ఒక తొలి ప్రేమ అంటూ సాగే పాటను విడుదల చేశారు.
ఈ సినిమాతో విరాజ్ జె అశ్విన్ హీరోగా పరిచయం అవుతుండగా రిద్ధి కుమార్ ,రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment