
‘అనగనగా ఓ ప్రేమకథ’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను ఈరోజు (శనివారం) ఉదయం ప్రముఖ హీరో గోపీచంద్ తన సోషల్ మీడియా ‘ట్విట్టర్’ ఖాతా ద్వారా విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్, దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టి, నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ...‘అనగనగ ఓ ప్రేమకథ’’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఎంతో ప్రామిసింగ్ గా ఉంది. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు గారు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన చేసిన ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. మార్తాండ్.కె.వెంకటేష్ గారు నాకు అన్న లాంటి వారు. ఆయన అక్క కొడుకు అశ్విన్. ఈ చిత్ర హీరో. సన్నివేశాలలో గానీ, సంభాషణలు పలకటంలోగానీ, పోరాటాలలో గానీ అశ్విన్ మంచి ప్రతిభ కనబరిచాడు. ఇదే అతని తొలి చిత్రం అనిపించటం లేదు. అంత బాగా నటించాడు. అశ్విన్ మంచి హీరో అవ్వాలని అభినందిస్తున్నాను. చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
తమ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.ఆయన మాట్లాడుతూ..ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ హీరో రాణా విడుదల చేశారు. అలాగే చిత్రంలోని గీతాలను ప్రముఖ దర్శకులు మణిరత్నం, పూరి జగన్నాధ్, శేఖరకమ్ముల, పరశురామ్ లు విడుదల చేశారు. ఇంతమంది విజయవంతమైన చిత్రాల దర్శకులు విడుదల చేయటం, ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు.
Comments
Please login to add a commentAdd a comment