రానా చేతుల మీదుగా ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్‌ | Anaganaga O Premakatha Teaser is launched by Rana Daggubati | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 22 2018 5:11 PM | Last Updated on Sat, Sep 22 2018 6:24 PM

Anaganaga O Premakatha Teaser is launched by Rana Daggubati - Sakshi

థౌజండ్‌ లైట్స్‌ మీడియా బ్యానర్‌పై ప్రతాప్‌ తాతంశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘అనగనగా ఓ ప్రేమకథ’. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్‌ మార్తండ్‌ కె వెంకటేష్‌ మేనల్లుడు విరాజ్‌ కె అశ్విన్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

వరుణ్‌ తేజ్‌ చేతుల మీదుగా ఇటీవల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ టాలీవుడ్‌ హంక్‌ రానా దగ్గుబాటి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. విరాజ్‌కు జోడిగా రిద్ధి కుమార్‌ నటిస్తున్న ఈ సినిమాకు కేసీ అంజన్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement