‘అనగనగనగా ఓ కథ’ సాంగ్‌ టీజర్‌ | Anaganga O Premakatha Title Song Teaser | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 3 2018 11:28 AM | Last Updated on Wed, Oct 3 2018 4:03 PM

Anaganga O Premakatha Title Song Teaser - Sakshi

థౌజండ్‌ లైట్స్‌ మీడియా బ్యానర్‌పై ప్రతాప్‌ తాతంశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘అనగనగా ఓ ప్రేమకథ’. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్‌ మార్తండ్‌ కె వెంకటేష్‌ మేనల్లుడు విరాజ్‌ కె అశ్విన్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ లిరికల్‌ వీడియోలతో సందడి చేస్తున్నారు. తాజాగా సినిమాలతో హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్‌ను రివీల్ చేస్తూ టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో హీరో విరాజ్‌ ప్లే బాయ్‌ తరహా పాత్రలో కనిపిస్తున్నాడు. పూర్తి పాట లిరికల్‌ వీడియోను గురువారం రిలీజ్‌ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. విరాజ్‌కు జోడిగా రిద్ధి కుమార్‌ నటిస్తున్న ఈ సినిమాకు కేసీ అంజన్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement