
ప్రదీప్ విరాజ్, దివ్య ఖుష్వా జంటగా మనోజ్ ఎల్లుమహంతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ ఇచ్చారు. బిజినెస్‌మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కు అందించారు.
లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బీఎన్‌కే (బంగారు నవీన్ కుమార్) నిర్మించనున్నారు. దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు బీఎన్‌కే. ఈ సినిమాకు కెమెరా: పంకజ్ తట్టోడ.
Comments
Please login to add a commentAdd a comment