నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘రావే నా చెలియా’. మహేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. దివంగత నెమలి సురేష్ నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు చంద్రకాంత్, మొదటి పాటను నటుడు కృష్ణతేజ్, మరో పాటను కొరియోగ్రాఫర్ పాల్ రిలీజ్ చేశారు.
చంద్రకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రనిర్మాత నెమలి సురేష్ ఇటీవలే చనిపోయారని తెలిసింది. ఒక మంచి సినిమా తీసి, చూడకుండానే ఆయన వెళ్లిపోవడం చాలా బాధాకరం’’ అన్నారు. ‘‘ఏడు నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు విడుదలవుతోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు మహేశ్వర్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌ఎమ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment