సరికొత్త కథతో వస్తోన్న బేబీ నటుడు.. రిలీజ్ ఎప్పుడంటే? | Viraj Aswin Latest Movie release On December Month On This Date | Sakshi
Sakshi News home page

Viraj Ashwin: మరో ఎమోషనల్‌ స్టోరీతో వస్తోన్న విరాజ్ అశ్విన్!

Nov 23 2023 9:27 PM | Updated on Nov 23 2023 9:33 PM

Viraj Aswin Latest Movie release On December Month On This Date - Sakshi

బేబి చిత్రంలో అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న నటుడు విరాజ్ అశ్విన్. తాజాగా అతను హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ క‌థానాయిక‌గా నటిస్తోంది. అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కత్వంలో శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌రు 15న విడుద‌ల చేస్తున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు. తాజాగా ఈ  మూవీ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను  నిర్మాత నిరీష్ రిలీజ్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్ర‌మిది. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్‌కు, పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమాలో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి స‌హ‌కారంతో చిత్రాన్ని డిసెంబ‌రు 15న విడుద‌ల చేస్తున్నామని అన్నారు.

అనంతరం ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్‌ను కొత్త‌గా చూస్తారు. ఆయ‌న పాత్రలో మంచి ఎన‌ర్జీ వుంటుంది. బేబి చిత్రంతో యూత్‌కు 'ద‌గ్గ‌రైన విరాజ్ ఈ చిత్రంతో మరింత చేరువ‌తాడు. కొత్తద‌నం ఆశించే ప్ర‌తి ఒక్క‌రికి మా చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది'  అని అన్నారు. ఈ చిత్రంలో సాయికుమార్‌, రోహిణి, మ‌ధునంద‌న్‌, సిరి హ‌నుమంతు, సోనూ ఠాకూర్‌,  బ్రహ్మ‌జీ , చ‌మ్మ‌క్ చంద్ర‌, క్రేజీ క‌న్నా ప్రధానపాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  ప్రణీత్ సంగీతమందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement