అనుకున్నది ఒకటి... అయ్యింది ఒకటి | Music Director Saketh sairam turns as director with Anukunnadokati..Ayyindi Okati | Sakshi
Sakshi News home page

అనుకున్నది ఒకటి... అయ్యింది ఒకటి

Published Mon, Sep 2 2013 12:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

అనుకున్నది ఒకటి... అయ్యింది ఒకటి

అనుకున్నది ఒకటి... అయ్యింది ఒకటి

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 15 చిత్రాలకు పాటలు స్వరపరిచిన సాకేత్ సాయిరామ్ దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంగా ‘అనుకున్నది ఒకటి... అయ్యింది ఒకటి’ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని రూపొందిస్తున్నారాయన. 
 
 విరాజ్, శ్రీధర్ హీరోలుగా గెహనా వశిష్ట్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్ పతాకంపై డాలీ భట్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కిడ్నాప్ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. సీనియర్ నటుడు సురేష్ చేసిన పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అలాగే హాస్య చేసిన ప్రత్యేక పాట హైలైట్‌గా నిలుస్తుంది. 
 
 ఈ చిత్రానికి నేనే పాటలు స్వరపరిచాను’’ అన్నారు. ‘‘సంగీతదర్శకుడిగా ప్రతిభ నిరూపించుకున్న సాకేత్ సాయిరామ్ దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటారనే నమ్మకం ఉంది. ఈ నెలలోనే పాటలను, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement