Baby Movie Director Sai Rajesh Sorry To Audience, Check Reason - Sakshi
Sakshi News home page

Baby Movie Director: ప్రేక్షకులకు దర్శకుడి క్షమాపణలు.. ఆ ఒక‍్క విషయంలో!

Published Thu, Jul 20 2023 5:58 PM | Last Updated on Thu, Jul 20 2023 6:12 PM

Baby Movie Director Sai Rajesh Sorry To Audience - Sakshi

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 'బేబీ' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఆరు రోజుల్లో రూ.43.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. నాలుగైదు రెట్ల లాభాలతో దూసుకెళ్తోంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ యాక్టింగ్.. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, సాయి రాజేశ్ డైరెక్షన్‌కి అందరూ ఫిదా అవుతున్నారు, వాళ‍్లని మెచ్చుకుంటున్నారు. అదే టైంలో బూతులు, కొన్ని సీన్లపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి స్వయంగా దర్శకుడే స్పందించాడు. ప్రేక్షకులకు సారీ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!)

'హీరోహీరోయిన్ల మధ్య లవ్‌స్టోరీ బలంగా ఉన్నట్లు సినిమా మొదట్లో చూపించాను. హీరో తన మాటలతో నొప్పిస్తేనే హీరోయిన్ మనసు మరోవైపు చూస్తుంది. ఆ సన్నివేశానికి తగ్గట్లు ఇంటర్వెల్‌లో కొన్ని అభ్యంతరకర పదాలు ఉపయోగించాల్సి వచ్చింది. 'తెరవాల్సింది కళ్లు కాదు..' అనే డైలాగ్‌ని పెట్టుండాల్సింది కాదు. ఆ మాటలు రాయకుండా ఉండాల్సింది. ఈ విషయంలో ప్రేక్షకులు క్షమాపణలు. మిగతావి మాత్రం సినిమాకు కచ్చితంగా కావాల్సినవే'

'బేబీ సినిమా నిడివి విషయంలో తొలుత విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తున్న ఎవరూ కూడా దాని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే క్లైమాక్స్ కోసం సినిమా మొదట్లో 16 నిమిషాల సీన్ పెట్టాను. దాన్ని ఎంతో కష్టపడి ఎడిట్ చేసి 7 నిమిషాలకు తీసుకువచ్చాను' అని దర్శకుడు సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement