Baby movie to be a turning point for me, says Viraj Ashwin - Sakshi
Sakshi News home page

Baby Movie -Viraj Ashwin: 'నా కెరీర్‌కు 'బేబీ' సినిమా టర్నింగ్ పాయింట్'

Jul 10 2023 3:44 PM | Updated on Jul 10 2023 4:01 PM

Viraj Ashwin About Baby Movie Telugu - Sakshi

'అనగనగా ఓ ప్రేమ కథ'తో యంగ్ హీరో విరాజ్ అశ్విన్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలి సినిమాలోనే నటనతో మెప్పించిన ఇతడు.. 'థ్యాంక్యూ బ్రదర్‌'తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ఆదరణ దక్కించుకుంది. విరాజ్ తన షార్ట్ ఫిల్మ్ 'మనసనమహ'తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిల్మ్(513 అవార్డులు)గా ఇది గిన్నీస్ రికార్డ్ సాధించింది. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మేనల్లుడే విరాజ్ అశ్విన్. తాజాగా 'బేబీ' మూవీతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. 

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!)

సాయి రాజేష్ దర్శకత్వం వహించిన 'బేబీ'.. ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని విరాజ్ అశ్విన్ భావిస్తున్నాడు. ట్రైలర్‌లో లవర్ బాయ్ తరహా పాత్రలో మెప్పించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది. పాటల్లోనూ అద్భుతంగా నటించాడు. ట్రైలర్ లాంచ్‌లో "చాక్లెట్ బాయ్ లుక్స్" అని విరాజ్ అశ్విన్‌ను చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ ప్రశంసించారు.

బేబీ ట్రైలర్‌ను చూస్తుంటే.. విరాజ్‌ అశ్విన్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తోంది. ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయితే మరిన్నీ క్రేజీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యే 'మాయపేటిక' సినిమాతో వచ్చాడు. త్వరలో 'బేబీ'తో రాబోతున్నాడు. మరో మూడు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ విరాజ్ అశ్విన్ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు.

(ఇదీ చదవండి: క్లైమాక్స్‌కు చేరిన లవ్‌.. దర్శకుడిని పెళ్లాడిన సీరియల్‌ నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement