ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం నిర్వహించింది. అయితే ఈ వేడుకకు హాజరైన బేబీ హీరోయిన్ వైష్ణవి ఎమోషనల్ అయ్యారు. వేదికపైనే కంటతడి పెట్టుకున్నారు. డైరెక్టర్ సాయి రాజేశ్ నటిగా తనకు పునర్జన్మనిచ్చారని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా.. ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.
(ఇది చదవండి: అందుకే సింగిల్‌గా ఉంటున్నా..పెళ్లిపై సదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
వైష్ణవి మాట్లాడుతూ..'యూట్యూబ్ వీడియోలు చేసుకునే నాకు ‘బేబీ’ సినిమాలో అవకాశమిచ్చారు. నాకన్నా ఎక్కువగా నన్ను నమ్మి ముందుకు నడిపించారు దర్శకుడు రాజేశ్. మెయిన్ లీడ్‌గా చేయాలనేదే నా లక్ష్యం. కానీ మధ్యలో సహాయ నటిగా చేశా. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారా. ఈ అమ్మాయి యూట్యూబర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి సినిమాలో మెయిన్ లీడ్ చేయలేదని చాలామంది అన్నారు. కానీ బేబీలో ఛాన్స్ రాగానే లీడ్ రోల్ చేయగలనా అని భయపడ్డా. కానీ డైరెక్టర్ రాజేశ్ నాకు ధైర్యాన్నిచ్చారు. ఈ విషయంలో నాకు మరో జన్మనిచ్చారు. అందువల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా. నిర్మాత ఎస్‌కేఎన్ కూడా నన్ను ఓ బేబీలా చూసుకున్నారు.'కంటతడి పెట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
(ఇది చదవండి: నయన్ భర్తకు వార‍్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!)
Comments
Please login to add a commentAdd a comment