Director Sai Rajesh Shocking Comments About Vaishnavi Chaitanya - Sakshi
Sakshi News home page

Baby Movie Director: వైష్ణవిని పెట్టినప్పటి నుంచి బయటినుంచి ఫుల్‌ నెగిటివిటీ: దర్శకుడు

Nov 23 2022 10:56 AM | Updated on Nov 23 2022 12:02 PM

Director Sai Rejesh Intreresting Comments on Vaishnavi Chaitanya - Sakshi

సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చింది నటి వైష్ణవి చైతన్య. తొలుత షార్ట్‌ ఫిలింస్‌తో గుర్తింపు పొందిన ఆమె ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్‌ అర్టిస్ట్‌గా అవకాశాలు అందుకుంది. అల వైకుంఠపురములో, వలిమై వంటి సినమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన వైష్ణవి ఇప్పుడు ఏకంగా బేబీ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆనంద్‌ దేవరకొండ హీరోగా సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానున్న నేపథ్యంలో రీసెంట్‌గా టీజర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్‌. 

చదవండి: అరుణాచలేశ్వరుని సేవలో శ్రీకాంత్‌ దంపతులు 

ఈ మూవీ టీజర్‌ ఈవెంట్‌లో దర్శకుడు సాయి రాజేశ్‌ మాట్లాడుతూ వైష్ణవి చైతన్యపై ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైష్ణవిని హీరోయిన్‌గా పెట్టినప్పటి నుంచి బయటి నుంచి తనకు విపరీతమైన ప్రెజర్‌ వచ్చిందని, ఫుల్‌ నెగిటివిటి వచ్చిందన్నాడు. సినిమాకు వైష్ణవిని హీరోయిన్‌గా తీసుకోవద్దంటూ తనకు చాలా ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌ వచ్చాయంటూ షాకింగ్‌ విషయం చెప్పాడు. ‘వైష్ణవిని నా సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నప్పటి నుంచి ఆ అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టావ్. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఆమెను చాలా మంది చూశారు. 

చదవండి: బిజినెస్‌ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా?

తనని ఎందుకు పెడుతున్నావ్‌? ఇంకెవరూ దొరకలేదా?” అని అనేవారని రాజేశ్‌ చెప్పుకొచ్చాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్‌కి చెల్లెలిగా చేయడం చూసేశాం, షార్ట్ ఫిలింస్‌, ఇతర సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చూశాం. కానీ లోపల ఏదో ఉంటుంది కదా. కథ అనుకున్నప్పుడే తను హీరోయిన్‌గా సెట్ అవుతుందని నాకు అనిపించింది. రేపు సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా షాక్ అవుతారు” అంటూ సాయి రాజేష్ వైష్ణవిపై తనకున్న నమ్మకాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement