అన్ని రీమేక్‌లు వర్కవుట్ అవుతాయనుకుంటే పొరపాటే! కొన్ని మంచి విజయాలను అందించినా మరికొన్ని మాత్రం దారుణ అపజయాలను తీసుకొస్తాయి. భోళా శంకర్ విషయంలో ఇదే జరిగింది. 2015లో తమిళంలో వచ్చిన వేదాళం మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. వంద కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమాపై డైరెక్టర్ మెహర్ రమేశ్ మనసు పారేసుకున్నాడు. చిరంజీవితో తీయాలనుకున్నాడు.
దెబ్బ కొట్టిన జైలర్
అక్కడ హిట్టంటే ఇక్కడ కూడా హిట్టే అనుకున్న చిరు వెంటనే ఓకే చేసేశాడు. సినిమా తీశారు. ఆగస్టు 11న బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. పైగా అప్పుడే రజనీకాంత్ కూడా జైలర్ సినిమాతో బరిలోకి దిగడం, ఆ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఆడియన్స్ అంతా అటువైపు మళ్లారు. ఫలితంగా భోళా శంకర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది.
పారితోషికం కోసం పట్టుబట్టిన చిరంజీవి?
అయితే ఈ సినిమాకుగానూ తన పారితోషికం మొత్తం ఇస్తే కానీ కుదరదని చిరంజీవి బెట్టు చేశాడని, దీంతో నిర్మాత అనిల్ సుంకర తన ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అతడికి డబ్బులు ఇచ్చేశాడంటూ ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ ఘాటుగానే స్పందించాడు. 'నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది. ఇంకో వారం రోజులు చిరంజీవి ముక్కు పిండి మరీ డబ్బులు ఎలా వసూలు చేశాడో కథలు కథలుగా వస్తాయి. ఇటు పక్క ఎలాగో నిజం చెప్పే మనిషి ఉండడు.
స్వయంగా ఆయన చేత్తో కాఫీ
మేము ఉండగా అనిల్ సుంకర గారు వచ్చారని, ఆయన్ను వెయిట్ చేయించాడని స్టాఫ్‌తో చెప్పి, పైకి రాగానే అటు వైపుగా ఉన్న ఐరన్ సోఫాని తన చేతులతో పక్కకు జరిపి మరీ కూర్చోబెట్టారు. పనిమనిషి తీసుకువచ్చిన కాఫీని ముగ్గురికి ఆయనే ఇచ్చారు. నిర్మాతకు ఆయన ఇచ్చే మర్యాద అలాంటిది! బాధాతప్త హృదయంతో నేను అనిల్ సర్ దగ్గర పని చేసే ఓ వ్యక్తికి ఫోన్ చేసి అసలు నిజం తెలుసుకున్నాను.. మా బాస్ మీరనుకుంటున్నట్లు కాదు.. ఆయన వేరే.. మా హీరో చిరంజీవిని చూసి నేను గర్విస్తున్నాను' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌తో చిరు, అనిల్ సుంకర మధ్య ఎటువంటి గొడవ జరగలేదని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment