‘హృదయ కాలేయం’ నిర్మాతపై దాడి | Film director Sai Rajesh assaulted; one held | Sakshi
Sakshi News home page

‘హృదయ కాలేయం’ నిర్మాతపై దాడి

Published Mon, Apr 7 2014 5:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM

Film director Sai Rajesh assaulted; one held

సాక్షి,హైదరాబాద్: ‘హృదయ కాలేయం’ చిత్ర నిర్మాత నీలం సాయిరాజేశ్‌పై మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్‌లో దాడిజరిగింది. ఎస్సై రంజిత్‌కుమార్ కథనం ప్రకారం... హృదయ కాలేయం సినిమా నిర్మాత సాయిరాజేశ్, మరో ఆరుగురు వ్యక్తులు శనివారం రాత్రి వెస్టిన్ హోటల్‌లో బస చేశారు.
 
 ఆ సమయంలో బంజారాహిల్స్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి మనోజ్ (29) మద్యం సేవించి అదే హోటల్‌లో బస చేశాడు. కాగా, తెల్లవారుజామున 3 గంటలకు బాత్రూమ్‌కు వెళ్లిన మనోజ్ అక్కడే ఉన్న సాయిరాజేశ్‌పై తాగిన మత్తులో దుర్భాషాలాడాడు. సినిమా డైలాగులతో జనాన్ని చంపుతున్నావంటూ వ్యంగ్యంగా మాట్లాడడమే కాకుండా సాయిరాజేశ్‌పై దాడిచేయడంతో ఆయన ముక్కుకు తీవ్ర గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందుతుడు మనోజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement