'నేను-కీర్తన' సినిమా సాంగ్‌కు భారీ రెస్పాన్స్‌ | Nenu Keerthana Telugu Movie Song Out Now | Sakshi
Sakshi News home page

'నేను-కీర్తన' సినిమా సాంగ్‌కు భారీ రెస్పాన్స్‌

Published Mon, Jun 24 2024 7:07 PM | Last Updated on Mon, Jun 24 2024 7:51 PM

Nenu Keerthana Telugu Movie Song Out Now

చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'నేను కీర్తన'. ఈ మూవీ నుంచి నుంచి విడుదలైన 'సీతాకోకై ఎగిరింది మనసే' లిరికల్ వీడియోకు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ లిరికల్ వీడియోను  దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేయడం తెలిసిందే. ఈ పాటను కులుమనాలిలో ఉన్న పలు లొకేషన్స్ లో చిత్రీకరించారు. దీంతో పాటలోని విజువల్స్‌ కూడా చాలా అందంగా వచ్చాయి.

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత,డైరెక్షన్‌,హీరో   చిమటా రమేష్ బాబునే కావడం విశేషం.

'బేబి' దర్శకుడు సాయి రాజేష్ గారు రిలీజ్ చేసిన సీతా కోకై" లిరికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తుండడం ఈ చిత్ర విజయంపై తాము పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది అంటూ.. ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. 'నేను - కీర్తన' చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement