ఒక్క ఫోటో వైరల్‌.. అనసూయ భర్తను నేనే అనుకున్నారు: సాయిరాజేష్‌ | Director Sai Rajesh Comments On Anasuya In Kcr Movie Event | Sakshi
Sakshi News home page

ఆ ఫోటో వల్ల అనసూయ భర్తను నేనే అనుకున్నారు: సాయిరాజేష్‌

Published Sat, Oct 19 2024 3:54 PM | Last Updated on Sat, Oct 19 2024 4:19 PM

Director Sai Rajesh Comments On Anasuya In Kcr Movie Event

'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్‌ )' చిత్రం ఆడియో వేడుకలో అనసూయ గురించి డైరెక్టర్‌ సాయిరాజేష్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. 'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా న‌టిస్తూనే  'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్‌ )' చిత్రానికి నిర్మాత‌గాను వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. ఆపై స్క్రీన్‌ప్లేను కూడా అందించాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బేబీ సినిమా డైరెక్టర్‌ సాయిరాజేష్‌, అన‌సూయ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో బావమ‌ర‌ద‌ళ్ల ప్రేమ‌క‌థ‌తో ద‌ర్శ‌కుడు 'గ‌రుడ‌వేగ' అంజి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుంది. అయితే, ఈ మూవీ ట్రైల‌ర్ లాంచ్‌ కార్యక్రమంలో యాంక‌ర్ అన‌సుయ‌పై ద‌ర్శ‌కుడు సాయి రాజేష్  ఆస‌క్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జబర్దస్త్ షో కోసం ఇద్దరం కలిసి పనిచేశాం. ఆ సమయంలో అనసూయతో ఒక సెల్ఫీ తీసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాను. అయితే, చాలామంది అనసూయ భర్తను నేనే అనుకుని బండబూతులు తిట్టారు. అనసూయకు సరైన టేస్ట్‌ లేదు.. ఈ వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది అంటూ కొందరు కామెంట్‌ చేశారు. తర్వాత  నేను క్లారిటీ కూడా ఇచ్చాను.' అంటూ సాయి రాజేష్ సరదాగ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి.

కానీ, ఇలాంటి వార్తలను తాను చూడలేదని అనసూయ చెప్పింది.  సాయిరాజేష్‌ అందరికీ మంచి చేసే వ్యక్తి అంటూ ఆమే తెలిపింది.. అందుకే రాకింగ్‌ రాకేశ్‌ సినిమా విజయం కోసం ఇంత దూరం వచ్చారని సాయిరాజేష్‌పై ఆమె ప్రశంసలు కురిపించింది. అనసూయ, సాయిరాజేష్‌ల మధ్య సరదాగ జరిగిన సంభాషణ ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement