రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎట్టకేలకు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నారు. బుల్లితెరపై పలు షోస్‌లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటవ్వనుంది. ఈ వేడుకకు జబర్దస్త్ నటులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, యాంకర్ రవి, అనసూయ, గెటప్ శ్రీను తదితరులు పాల్గొని జంటను ఆశీర్వదించారు.
ఇటీవలే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది సుజాత. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది. రాకేశ్‌తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలకో ఓ వీడియోలో షేర్ చేసింది సుజాత. త్వరలోనే పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంటకు పలువురు సినీతారలు శుభాంకాంక్షలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment