
బుల్లితెరపై యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించిన తెలిసిందే. గ్లామరస్ యాంకర్‌గా అనసూయకు పేరుంది. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.ప్రస్తుతం టీవీ షోలతో పోలిస్తే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వరుస మూవీ ఆఫర్లతో బిజీబిజీగా ఉంటోంది.
ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనసూయ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తన పెళ్లినాటి మధుర ఙ్ఞాపకాలను షేర్ చేసుకుంది. గులాబీ రంగు చీరలో మెరిసిపోయిన అనసూయ.. ఇది 15ఏళ్ల క్రితం నాటి తన ఎంగేజ్‌మెంట్ శారీ అంటూ మురిసిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment