ఎక్కడ చూసినా బేబి ఫీవరే నడుస్తోంది. ఈ సినిమా వచ్చి 20 రోజులు దాటిపోతున్నా ఇప్పటికీ దీని క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నాలుగో వారం కూడా థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూలు చేసి వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో బేబీ టీమ్ సక్సెస్ టూర్స్ చేస్తోంది. అందులో భాగంగా శనివారం నాడు శ్రీకాకుళం పర్యటనకు వెళ్లింది. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూసిన సాయి రాజేశ్ ప్రేక్షకుల స్పందన చూసి షాకైపోయాడట! ఈ మేరకు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
'బేబీ సినిమాలో ఆనంద్ బర్త్‌డే రోజు హర్ష వచ్చి అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్తాడు. అప్పుడు ప్రేక్షకులు ఫీలవ్వాలని.. పెద్దగా మ్యూజిక్ లేకుండా నిశ్శబ్ధ వాతావారణం ఉండేలా జాగ్రత్తపడ్డాం. హీరో బాధ అర్థం చేసుకుంటారనుకుని బీజీఎమ్ మ్యూట్ చేసేశా.. కానీ ఈరోజు శ్రీకాకుళంలోని ఓ థియేటర్‌లో వందకు పైగా ప్రేక్షకులు ఆ బాధను ఫీలవ్వాల్సింది పోయి హ్యాపీ బర్త్‌డే ఆనంద్ అని అరిచారు. థూ నా బతుకు' అంటూ ట్వీట్ చేశాడు. తానొకటి తలిస్తే ప్రేక్షకులు మాత్రం మరోలా రెస్పాండ్ అవుతున్నారేంటని అయోమయానికి లోనయ్యాడు డైరెక్టర్. ఈ ట్వీట్‌పై ఆనంద్ దేవరకొండ ఫన్నీ ఎమోజీలతో రియాక్ట్ అయ్యాడు. ఏమైందో ఏమో కానీ కాసేపటికే సాయి రాజేశ్ ఈ ట్వీట్ డిలీట్ చేశాడు.
బేబి విషయానికి వస్తే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది.
చదవండి: పుట్టుకతోనే నా కూతురికి అంత పెద్ద కష్టం.. ఏడ్చేసిన హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment