తెలుగులో ఈ మధ్య కాలంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా 'బేబీ'. విడుదలై మూడు వారాలు అవుతున్నా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడిపోతున్నాయి. అల్లు అర్జున్‌తోపాటు చాలామంది యంగ్ హీరోస్ ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. రీసెంట్‌గా 'బేబీ' చూసిన ఆయన.. దర్శకనిర్మాతల్ని ఇంటికి పిలిచి మరీ అభినందించారు.
(ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే)
దర్శకుడి భావోద్వేగం
'కల నిజమైన వేళ. నా దేవుడితో(చిరంజీవి) రెండు గంటలు ఉన్నాను. ఆయనకు 'బేబీ' నచ్చింది. ప్రతి విభాగాన్ని మెచ్చుకున్నారు. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణం. రెండు గంటలు బాబాయ్ రెండు గంటలు. బాస్ మాట్లాడుతుంటే కన్నీళ్లు వచ్చేశాయి' అని 'బేబీ' దర్శకుడు సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.
చిరు కోసం స్పెషల్‌గా
అయితే 'బేబీ' చూసి దర్శకనిర్మాతలని చిరు అభినందించారు. అయితే విషయం ఇక్కడితే అయిపోలేదు. మొన్న అల్లు అర్జున్ కోసం పెట్టినట్లు.. ఇప్పుడు చిరంజీవి కోసం స్పెషల్ గా మరో ఈవెంట్ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. బహుశా అది ఈ సినిమాని ప్రశంసించడంతో పాటు అటు 'భోళా శంకర్' ప్రమోషన్‌కి కూడా వర్కౌట్ కావొచ్చు అనిపిస్తుంది. ఇదిలా ఉండగా 'బేబీ'కి 12 రోజుల్లో రూ.70 కోట్లకు పైగా వసూళ్లు దక్కాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment