Baby Appreciation Meet: Allu Arjun Interesting Comments On Baby Movie, Praises Entire Team - Sakshi
Sakshi News home page

Allu Arjun On Baby Movie: సినిమా బాగుంటే ఎందుకు చూడరు

Published Fri, Jul 21 2023 12:50 AM | Last Updated on Fri, Jul 21 2023 11:56 AM

movie is good then why not watch it - Sakshi

‘‘7/జి బృందావన కాలనీ, అర్జున్‌ రెడ్డి’ సినిమాలు ప్రేమలోని బాధను చూపిస్తాయి. అలాంటి సినిమాలు తీయాలంటే చాలా కష్టం. అదే కోవలో వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘బేబి’ సినిమాని అద్భుతంగా తీశారు సాయిరాజేష్‌’’ అని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ లీడ్‌ రోల్స్‌లో సాయి రాజేష్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న రిలీజైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బేబి అప్రిషియేషన్‌ మీట్‌’కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను చూడరు అంటుంటారు. కానీ అది అబద్ధం.. సినిమా బాగుంటే ఎందుకు చూడరు? సాయి రాజేష్‌గారు చాలా బాగా తీశారు. ఆయన రాసిన కథ విధానం ఇంకా బాగా నచ్చింది’’ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement