బేబి కాంబో రిపీట్‌  | Baby Combo Repeats For A Special Project | Sakshi
Sakshi News home page

బేబి కాంబో రిపీట్‌ 

Published Sat, Oct 21 2023 12:21 AM | Last Updated on Sat, Oct 21 2023 4:30 AM

Baby Combo Repeats For A Special Project - Sakshi

ఆనంద్, వైష్ణవీ చైతన్య 

‘బేబి’ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ వైష్ణవీ చైతన్య కాంబినేషన్‌లో మరో సినిమా రూ΄పొందనుంది. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్‌ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

అమృతప్రోడక్షన్స్, మాస్‌ మూవీ మేకర్స్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్‌ మొదలవుతుంది. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బుల్గానిన్, కెమెరా: బాల్‌ రెడ్డి, సహనిర్మాత: ధీరజ్‌ మొగిలినేని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement