repeat combinations
-
అంతరిక్షం నుంచి అంతుచిక్కని రేడియో సిగ్నల్స్
అంతరిక్షం నుంచి వెలువడుతున్న వింత రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలను తెగ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఆస్ట్రేలియాలోని మూడు వేర్వేరు ప్రాంతాల గుండా ఒకే కక్ష్యలో తిరుగుతూ ప్రతి గంటకు పునరావృతమవుతున్న రేడియో సిగ్నల్స్‌ను గుర్తించారు. మరి వీటి గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..రేడియో సిగ్నల్స్ గురించి ఇప్పటికే కొన్ని సిద్దాంతాలు ఉన్నప్పటికీ, తాజాగా కనిపించిన వింత సిగ్నల్స్ శాస్త్రవేత్తల ముందు మరిన్ని సవాళ్లను ఉంచాయి. ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్‌ఫైండర్ (ఏఎస్‌కేఏపీ)రేడియో టెలిస్కోప్ ద్వారా సేకరించిన డేటాలో ఈ తరహాలోని మొదటి సిగ్నల్ కనిపించింది. ఇది ప్రతి 53.8 నిమిషాలకు పునరావృతమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ సిగ్నల్ మూడు వేర్వేరు రాష్ట్రాల గుండా వెళుతోంది. ఈ సిగ్నల్ 10 నుంచి 50 సెకన్ల మధ్య ప్రకాశవంతమైన వెలుగులను విరజిమ్ముతోంది. ఈ రేడియో తరంగాలు అన్నీ ఒకే దిశలో పాయింట్ అవుతున్నాయి.దీనిపై అధ్యయనం సాగిస్తున్న డాక్టర్ మనీషా కాలేబ్ మాట్లాడుతూ ఈ రేడియో సిగ్నల్ మూడు విభిన్న ఉద్గార స్థితులను ప్రదర్శిస్తుండటం విచిత్రంగా ఉందని, దీని లక్షణాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు. దక్షిణాఫ్రికాలోని మీర్కాట్ రేడియో టెలిస్కోప్ ఈ సిగ్నల్స్‌ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విభిన్న సంకేతాలను ఉత్పత్తి చేస్తున్న రేడియో సిగ్నల్ వెనుక ఏమి ఉందనే దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఇది న్యూట్రాన్ నక్షత్రం లేదా వైట్ డ్వార్ఫ్ నుండి వెలువడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సిగ్నల్కున్న విచిత్రమైన లక్షణాలు ఇప్పటివరకూ ఉన్న భౌతిక శాస్త్ర వివరణలకు అందని విధంగా ఉన్నాయి.న్యూట్రాన్ నక్షత్రాలు, వైట్ డ్వార్ఫ్ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవి రెండూ భారీ నక్షత్రాల నుండి ఉత్పన్నమవుతాయి. న్యూట్రాన్ నక్షత్రాలు క్రమం తప్పకుండా రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. వైట్ డ్వార్ఫ్ ఎలక్ట్రాన్ క్షీణించిన మూలకం. న్యూట్రాన్ నక్షత్రం అనేది న్యూట్రాన్ క్షీణించిన మూలకం . వైట్ డ్వార్ఫ్ అనేది భారీ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది న్యూట్రాన్ నక్షత్రం కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. కాగా అంతరిక్షం నుంచి పునరావృతమయ్యే ఇటువంటి రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరడచం ఇదేమీ మొదటిసారికాదు. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సిగ్నల్స్‌ను గుర్తించారు. అయితే ఇది న్యూట్రాన్ నక్షత్రం నుండి వచ్చినదా, లేదా అంతుచిక్కని వైట్ డ్వార్ఫ్ పల్సర్ నుంచి వచ్చినదా అనేది మరిన్ని పరిశోధనలతో వెల్లడికానుంది. దీనిపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం సాగిస్తున్నారని డాక్టర్ మనీషా కాలేబ్ తెలిపారు. -
కాంబినేషన్ రిపీట్?
‘పవర్’ మూవీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పవర్’. 2014లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. అయితే రవితేజ, బాబీల కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. రవితేజ కోసం ఓ పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నారట బాబీ. త్వరలోనే రవితేజకి ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నారట దర్శకుడు.అన్నీ కుదిరితే వీరి కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అవుతుందని టాలీవుడ్ టాక్. అంతేకాదు.. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారని భోగట్టా. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోనూ రవితేజ ఓ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. -
లెక్క కుదిరింది
కెప్టెన్ ఆఫ్ ది షిప్ (డైరెక్టర్)కి, షిప్ ఓనర్ (ప్రోడ్యూసర్)కి మధ్య మంచి రిలేషన్ ఉండాలి. షిప్ (సినిమా)ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, యజమాని నష్టపోకుండా కెప్టెన్ చూసుకుంటే.. ఇక అతనికి, యజమానికీ మధ్య మంచి అవగాహన కుదురుతుంది. మళ్లీ మళ్లీ కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు.అలా లెక్కలు కుదిరి కొన్ని కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. ఇలా ఓ దర్శకుడికి–నిర్మాతకి మధ్య స్నేహం కుదరడం, మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకోవడం ఓ ఆరోగ్యకరమైన వాతావరణం అని చెప్పాలి. రిపీట్ అవుతున్న ఆ దర్శక–నిర్మాతల కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. ‘దిల్’ రాజు, అనిల్ రావిపూడిమూడోసారి ‘దిల్’ కలిసిందికుటుంబ నేపథ్యంలో సినిమాలు తీసి విజయాలు అందుకునే నిర్మాతగా ‘దిల్’ రాజుకి పేరుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా తెరకెక్కించగల దర్శకుడు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్లో సుప్రీమ్ (2016), ‘రాజా ది గ్రేట్’ (2017), ‘ఎఫ్ 2’ (2019), ‘సరిలేరు నీకెవ్వరు’ (2020), ‘ఎఫ్ 3’ (2022) వంటి హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా అనిల్–‘దిల్’ రాజు కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇందులో వెంకటేశ్ హీరో. హిట్ చిత్రాలు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తర్వాత వెంకటేశ్–అనిల్ రావిపూడి–‘దిల్’ రాజు కాంబినేషన్లో రూపొందనున్న మూడో చిత్రమిది. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ అనుకుంటున్నారట. రవిశంకర్, నవీన్, సుకుమార్‌గురు–శిష్యులతో మైత్రీడైరెక్టర్ సుకుమార్–మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). రామ్‌చరణ్, సమంత జోడీగా నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్–మైత్రీ కాంబినేషన్లో రూపొందిన రెండో చిత్రం ‘పుష్ప: ది రైజ్’ (2021). అల్లు అర్జున్, రష్మికా మందన్న జోడీగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా సుకుమార్–నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ కాంబినేషన్లో ‘పుష్ప 2: ది రూల్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనూ అల్లు అర్జున్, రష్మికానే జోడీగా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది.∙సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనాని దర్శకునిగా పరిచయం చేస్తూ వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉప్పెన’ (2021) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన రెండో చిత్రాన్ని కూడా మైత్రీలోనే చేస్తున్నారు బుచ్చిబాబు. రామ్‌చరణ్ హీరోగా నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. సునీల్, రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ములశేఖర్‌తో మరో సినిమాప్రేమకథలే కాదు.. కుటుంబ కథలనూ తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా ‘కుబేర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్), అమిగోస్ క్రియేషన్స్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. కాగా శేఖర్, సునీల్ నారంగ్, రామ్మోహన్ కాంబినేషన్లో రూపొందుతోన్న రెండో చిత్రం ఇది. ఈ కాంబినేషన్లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘లవ్ స్టోరీ’ (2021) సూపర్ హిట్టయింది. నాగ్ అశ్విన్, ప్రియాంక, అశ్వినీదత్, స్వప్నహోమ్ బేనర్లో నాగ్ అశ్విన్‌ఇంట్లోనే ఒక పెద్ద బేనర్ ఉంటే బయట బేనర్ల అవసరం అంతగా ఉండదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి రెండు హోమ్ బేనర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ఉన్నాయి. అశ్వినీదత్ రెండో కుమార్తె ప్రియాంక, నాగ్ అశ్విన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్, స్వప్న సినిమాస్‌పై ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బేనర్లలో ‘ఎవడే సుబ్రమణ్యం’ (2015), ‘మహా నటి’ (2018) సినిమాలకు దర్శకత్వం వహించారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ నెల 27న రిలీజ్ కానుంది. నాగవంశీ, వెంకీసార్‌తో ఆరంభమై లక్కీతో మళ్లీ...డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘సార్’ (తమిళంలో వాత్తి). ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దర్శక–నిర్మాతల కాంబినేషన్లో తాజాగా ‘లక్కీ భాస్కర్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ , మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. శ్రీకాంత్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెలహీరో కూడా రిపీట్‌శ్రీకాంత్ ఓదెల దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘దసరా’ (2023). తొలి చిత్రంతోనే నానీని దర్శకత్వం వహించే చక్కని అవకాశం అందుకుని సద్వినియోగం చేసుకున్నారు. నాని, కీర్తీ సురేష్ జోడీగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ‘దసరా’ కాంబినేషన్లోనే మరో సినిమా రానుంది. నాని కెరీర్లో ఇది 33వ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. టీజీ విశ్వప్రసాద్, కార్తీక్ రెండోసారి రెండు భాగాలతో... ‘ఈగల్’ చిత్రం తర్వాత డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని–పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో ‘మిరాయ్’ సినిమా రూపొందుతోంది. రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరో, హీరోయిన్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘ఈగల్’ ఈ ఏడాది విడుదలైంది. ప్రస్తుతం కార్తీక్–విశ్వప్రసాద్ కాంబినేషన్లో ‘మిరాయ్’ చిత్రం రూపొందుతోంది. తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటిస్తున్న ‘మిరాయ్’లో మంచు మనోజ్ కీలక పాత్ర చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం 2025 ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2డీ, 3డీ వెర్షన్లలోనూ రిలీజ్ కానుంది. ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డిఈసారి ‘జై హనుమాన్’తో...సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాల పోటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా హీరోగా ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఇక ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ప్రశాంత్ వర్మ–చైతన్య–నిరంజన్ రెడ్డి కాంబినేషన్లో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.వీరే కాదు.. మరికొందరు దర్శక–నిర్మాతల కాంబినేషన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. -
జోడీ రిటర్న్స్
కొన్ని జంటలు ‘హిట్’ అవుతాయి. వెండితెరపై హిట్ అయిన ఆ జోడీలను మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మళ్లీ ఆ జోడీకి తగ్గ కథ కుదరాలి, కథ కుదిరితే ఇద్దరి డేట్స్ సెట్ అవ్వాలి. ఈ రెండూ సెట్ అయి, వెంటనే రిపీట్ అయిన జోడీలు ఉంటాయి.. ఎన్నో ఏళ్లకు గానీ రిపీట్ అయ్యే జోడీలూ ఉంటాయి. అలా కొన్నేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం.విశ్వంభర పిలిచాడు దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత హీరో హీరోయిన్లుగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చిరంజీవి, త్రిష. ఈ ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘స్టాలిన్’ 2006లో విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, సిస్టర్ సెంటిమెంట్‌తో పాటు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఈ కథలో ఉంటాయని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ షెడ్యూల్లో ఇంట్రవెల్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త. షష్ఠిపూర్తి సంబరం రాజేంద్రప్రసాద్–అర్చన కలిసి నటించిన ‘లేడీస్ టైలర్’ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 1986లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన కలిసి మళ్లీ వెంటనే మరో సినిమా చేయలేదు. 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘షష్ఠిపూర్తి’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ లీడ్ రోల్స్‌లో, ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, శకుంతల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ కుటుంబకథా చిత్రానికి ఇళయరాజా స్వరకర్త. అప్పటి ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాయే ఈ ‘షష్ఠిపూర్తి’ సినిమాకూ స్వరాలు సమకూర్చడం విశేషం. కుటుంబ విలువలు, కుటుంబ సభ్యుల అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపేష్ నిర్మిస్తున్నారు. తెరపై యాభైఆరోసారి... మలయాళ సిల్వర్ స్క్రీన్‌పై మోహన్‌లాల్, శోభనల జోడీ సూపర్ హిట్. ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ (1985) సినిమా కోసం తొలిసారి మోహన్‌లాల్, శోభన జత కట్టారు. ఆ తర్వాత ‘మణిచిత్ర తాళు’, ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ సినిమాలతో పాటు యాభైసార్లకు పైగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు మోహన్‌లాల్, శోభన. అయితే 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ తర్వాత మరోసారి మోహన్‌లాల్, శోభన కలిసి లీడ్ రోల్స్‌లో నటించలేదు.ప్రస్తుతం మోహన్‌లాల్ హీరోగా నటించనున్న 360వ చిత్రంలో శోభన ఓ లీడ్ రోల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది మోహన్‌లాల్, శోభన కలిసి నటిస్తున్న 56వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో మోహన్‌లాల్‌కు జోడీగా కనిపిస్తారట శోభన. తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తారని టాక్. ఈ ఏడాది ఓనమ్‌కు సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. పెళ్లి తర్వాత తొలి సినిమా? దాదాపు పాతికేళ్ల క్రితం తమిళ చిత్రం ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ (1999)లో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై జోడీగా కనిపించారు సూర్య, జ్యోతిక. ఆ తర్వాత ‘ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కక్క, మాయావి’ వంటి సినిమాల్లో సూర్య, జ్యోతిక హిట్ జోడీ అనిపించు కున్నారు. చివరిసారిగా 2006లో ‘సిల్లున్ను ఒరు కాదల్’ సినిమాలో సూర్య–జ్యోతిక జోడీగా కనిపించారు.ఈ సినిమా విడుదలైన తర్వాత సూర్య, జ్యోతిక రియల్ లైఫ్ జోడీ కూడా అయ్యారు. అయితే ‘సిల్లున్ను ఒరు కాదల్’ తర్వాత సూర్య, జ్యోతిక కలిసి సినిమా చేయలేదు. పద్దెనిమిదేళ్ల తర్వాత ఆ సమయం ఆసన్నమైందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘కేరళ కేఫ్’, ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అంజలీ మీనన్ ఓ కథ సిద్ధం చేశారని, ఈ కథతో తెరకెక్కనున్న సినిమాలో సూర్య, జ్యోతిక జోడీగా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలిసి నటించే చిత్రం ఇదే అవుతుంది. ఇంకా మరికొందరి హీరో హీరోయిన్ జోడీలు రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. -
ఇరవయ్యేళ్ల తర్వాత యాభైఆరవ చిత్రంలో...
మాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ హిట్ పెయిర్ మోహన్‌లాల్, శోభనల జోడీ రిపీట్ కానుంది. మోహన్‌లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో భాగమైనట్లుగా సోషల్ మీడియాలో శోభన ఓ వీడియో షేర్ చేశారు. ‘‘మోహన్‌లాల్‌గారి ఈ 360వ సినిమాలో నేను నటించనున్నాను. నాకు గుర్తు ఉన్నంతవరకు ఆయనతో నేను కలిసి చేయబోతున్న 56వ చిత్రం ఇది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శోభన. ఇక 1985లో వచ్చిన మలయాళ చిత్రం ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’లో తొలిసారి కలిసి నటించారు మోహన్‌లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ ‘మణిచిత్ర తాళు’ (ఈ సినిమా ఆధారంగానే ‘చంద్రముఖి’ తీశారు), ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1994లో వచ్చిన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’లో మెహన్‌లాల్, శోభన లీడ్ రోల్స్‌లో నటించారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మోహన్‌లాల్, శోభన కలిసి నటించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. 2009లో వచ్చిన మలయాళ చిత్రం ‘సాగర్ ఆలియాస్ జాకీ రీలోడెడ్’లో మోహన్‌లాల్ హీరోగా నటించగా, శోభన ఓ అతిథి పాత్ర చేశారు. -
గుర్తింపు అవసరం లేదు!
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గత ఏడాది మార్చి 30న విడుదలైన ‘దసరా’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. నాని కెరీర్‌లోని ఈ 33వ సినిమాను ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరియే నిర్మించనున్నారు. ‘దసరా’ విడుదలై, ఏడాది పూర్తయిన సందర్భంగా తాజా చిత్రాన్ని శనివారం (మార్చి 30)న అధికారికంగా ప్రకటించింది యూనిట్. ‘లీడర్ కావాలనుకుంటే నీకు గుర్తింపు అవసరం లేదు’ అని అర్థం వచ్చేలా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ పై ఓ ఇంగ్లిష్ కోట్ ఉంది. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇక ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. అలాగే సుజిత్ డైరెక్షన్లో హీరోగా నాని ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. -
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘రంగస్థలం’ (2018). కాగా రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయట. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది. ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని భోగట్టా. చరణ్ సినిమాలో సంజయ్ దత్? రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక హిందీలో రామ్‌చరణ్ చేసిన తొలి చిత్రం ‘తుఫాన్’లో సంజయ్ దత్ ఓ రోల్ చేశారు. మరి.. రామ్‌చరణ్, సంజయ్ దత్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
కథ సెట్.. కాంబో రిపీట్
ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్లో ఓ బ్లాక్‌బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. బిగిన్ ది బిగిన్ కమల్‌హాసన్ కెరీర్లో ‘నాయగన్’ (1987) బ్లాక్‌బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్. మణిరత్నం, కమల్‌హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్‌హాసన్ కెరీర్లో ఓ బ్లాక్‌బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్ల కాంబినేషన్లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. లక్నో టు లాహోర్ దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు . ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్‌హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’. ‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్‌కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్‌కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది. ఎప్పటికీ హీరోయే! జాకీ ష్రాఫ్‌ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్‌హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్‌తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి. -
బేబి కాంబో రిపీట్
‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో మరో సినిమా రూ΄పొందనుంది. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృతప్రోడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
రిపీట్టే...
ఒక సినిమాలో హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే మళ్లీ ఆ జంటను చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అయితే ఆ జంటకి మ్యాచ్ అయ్యే కథ దొరకాలి.. ఆ కథకు ఈ ఇద్దరినే హీరో–హీరోయిన్గా తీసుకోవాలనే ఆలోచన డైరెక్టర్‌కి రావాలి. ఇలా కొన్ని జంటలకు కథ కుదిరింది.ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తే బాగుండనే ఆలోచన డైరెక్టర్‌కీ వచ్చింది. ‘రిపీట్టే..’ అంటూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆ జంటలు చేస్తున్న చిత్రాల గురించి... ► ‘వినయ విధేయ రామ’ చిత్రంతో ఆకట్టుకున్న హీరో రామ్‌చరణ్–హీరోయిన్ కియారా అద్వానీ ‘గేమ్ చేంజర్’ కోసం రెండోసారి జోడీ కట్టారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ‘భరత్ అనే నేను’ (2018) సినిమాతో కియారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘వినయ విధేయ రామ’ (2019) లో రామ్‌చరణ్‌కి జోడీగా నటించారామె. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇక ఈ ఇద్దరూ జత కట్టిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ΄÷లిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూ΄పొందుతోంది. ► ‘లవ్‌స్టోరి’ (2021)తో ప్రేక్షకులకు అందమైన ప్రేమకథని చూపించారు హీరో నాగచైతన్య–హీరోయిన్ సాయిపల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూ΄పొందిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ జంట రెండేళ్లకు రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ‘ప్రేమమ్’ (2016), ‘సవ్యసాచి’ (2018) చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య– డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో మూడో సినిమా రూ΄పొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. చైతు–సాయిపల్లవి తొలిసారి జత కట్టిన ‘లవ్‌స్టోరి’లానే తాజా చిత్రం కూడా ప్రేమ ప్రధానాంశంగా సాగుతుంది. ► ‘భీష్మ’ వంటి హిట్ సినిమా తర్వాత నితిన్–రష్మికా మందన్నా రెండోసారి నటించనున్న సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘భీష్మ’ (2020) చిత్రంలో నితిన్– రష్మిక తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రత్యేకించి నితిన్–రష్మిక డ్యాన్స్‌లు ప్రేక్షకులను అలరించాయి. ఇక వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘ఛలో’ చిత్రం ద్వారానే రష్మిక తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ విధంగా నితిన్–రష్మిక–వెంకీ కుడుముల.. ఈ ముగ్గురి కాంబినేషన్లో తాజాగా రెండో సినిమా రూ΄పొందుతోందని చెప్పొచ్చు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి రష్మికా మందన్న తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా డేట్స్ సర్దుబాటు కాక΄ోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. ఆమె స్థానంలో శ్రీలీల అవకాశం అందుకున్నారని టాక్. ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ► ‘గీత గోవిందం’(2018), ‘డియర్ కామ్రేడ్’ (2019) వంటి చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారని టాక్. విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత హీరోయిన్గా శ్రీ లీలను ఫిక్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్పై రూ΄పొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే వరుస సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ‘వీడీ 12’ ్రపాజెక్ట్ నుండి శ్రీ లీల తప్పుకున్నట్లు టాక్ . దీంతో చిత్ర యూనిట్ రష్మికా మందన్నాని సంప్రదించగా... ఈ బ్యూటీ పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే విజయ్–రష్మిక కలిసి నటించనున్న మూడో చిత్రం ఇదే అవుతుంది. అయితే నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పుకోవడంతో ఆ ప్లేస్‌ని శ్రీ లీల భర్తీ చేశారని, విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుంటే ఈ ్రపాజెక్ట్లోకి రష్మిక ఎంట్రీ ఇచ్చారనే వార్తలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ► ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత హీరో కల్యాణ్ రామ్–హీరోయిన్ సంయుక్తా మీనన్ ‘డెవిల్’ సినిమా కోసం రెండోసారి జోడీ కట్టారు. వశిష్ఠ దర్శకత్వంలో కల్యాణ్ రామ్–సంయుక్తా మీనన్ జంటగా నటించిన తొలి చిత్రం ‘బింబిసార’ (2022). ఈ చిత్రవిజయంతో హిట్ పెయిర్ అనిపించుకున్న కల్యాణ్ రామ్–సంయుక్తా మీనన్ తాజాగా ‘డెవిల్’లో నటిస్తున్నారు. దేవాన్ష్ నామా సమర్పణలో పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కానుంది. ఇలా రిపీట్ అవుతున్న జంటలు ఇంకొన్ని ఉన్నాయి. -
ఆ దర్శకుడితో ధనుష్ మరో సినిమా
హీరో ధనుష్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. అయితే ‘కెప్టెన్ మిల్లర్’ తర్వాత అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలోనే మరో సినిమా చేయనున్నారు ధనుష్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇలా ధనుష్, అరుణ్ కాంబినేషన్ రిపీట్ కానుంది. అలాగే ఈ సినిమాకు ధనుష్ నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన కెరీర్‌లోని 50వ సినిమాతో బిజీగా ఉన్నారు ధనుష్. ఈ మూవీలో ఆయన హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే అరుణ్ సినిమాని స్టార్ట్ చేస్తారట. -
జోడీ రిపీట్?
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అలా ఈ చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి అరంగేట్రం లభించింది. ‘సీతారామం’ను నిర్మించిన వైజయంతీ మూవీస్‌లోనే మృణాల్ మరో సినిమా సైన్ చేశారట. ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుల్లో హను రాఘవపూడి, నందినీ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరో పాత్రకు దుల్కర్ సల్మాన్ పేరు పరిశీలనలో ఉందట. ఒకవేళ ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్ ఫిక్స్ అయితే ‘సీతారామం’ జోడీ రిపీటైనట్లే. మరి.. దుల్కర్, మృణాల్ మళ్లీ జోడీ కడతారా? వేచి చూడాల్సిందే. -
మరోసారి జంటలుగా రానున్న హీరో-హీరోయిన్లు..
హీరో-హీరోయిన్ జోడీ రిపీట్ కావడం కామన్. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఒకేసారి పది జంటలు రిపీట్ అవుతున్నాయి. అన్నీ భారీ చిత్రాలే. బోలెడన్ని అంచనాలున్న సినిమాలే. ఇక రిపీట్ అవుతున్న జోడీ నటిస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. చిరంజీవి-తమన్నా మళ్లీ ఆన్‌స్క్రీన్ లవర్స్‌గా కనిపించనున్నారు. ‘సైరా’లో ఈ ఇద్దరూ ప్రేమికులుగా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘బోళా శంకర్’లో జంటగా నటిస్తున్నారు. తమిళ ‘వేదాళం’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ కథ ప్రకారం ముందు హీరోని చంపాలనుకుంటుంది హీరోయిన్. ఆ తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. తెలుగు రీమేక్‌లోనూ ఇలానే ఉంటుందని అనుకోవచ్చు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్ కనిపిస్తారు. ఇక ‘మహర్షి’లో రిషీ కుమార్ (మహేశ్‌బాబు), పూజ (పూజా హెగ్డే)ల చిన్ని చిన్ని అలకలు, ప్రేమ, దూరం కావడం, మళ్లీ దగ్గరవడం చూశాం. తాజాగా త్రివిక్రమ్ సినిమా కోసం ఇద్దరూ మళ్లీ జత కట్టారు. మహేశ్-పూజ జతకట్టిన రెండో సినిమా ఇది. అయితే త్రివిక్రమ్‌తో ఈ ఇద్దరికీ మూడో సినిమా కావడం విశేషం. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్-మహేశ్, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్-పూజా హెగ్డే కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుంది. మరోవైపు రామ్ చరణ్-కియారా అద్వానీ కూడా మళ్లీ జతకట్టారు. ‘వినయ విధేయ రామ’లో తొలిసారి ఈ జంట కనిపించింది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్నారు. శంకర్ డైరెక్ట్‌గా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇదే. ఇక ఈ సంక్రాంతికి క్యూట్ లవర్స్‌గా ‘బంగార్రాజు’లో కనిపించిన నాగచైతన్య, కృతీ శెట్టి మరో సినిమాలో హీరో హీరోయిన్గా కనిపించనున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కోలీవుడ్‌కి చైతూ ఎంట్రీ ఈ సినిమాతోనే జరుగుతోంది. కాగా ఆల్రెడీ రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ది వారియర్’ ద్వారా కోలీవుడ్‌కి పరిచయం కానున్నారు కృతి. చైతూ, రాశీ ఖన్నాల జోడీ కూడా మళ్లీ కనిపించనుంది. ‘వెంకీ మామ’లో జంటగా నటించిన నాగచైతన్య-రాశీ ఖన్నా తాజాగా ‘థ్యాంక్యూ’లో హీరో, హీరోయిన్గా నటించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 22న విడుదల కానుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత నాని-కీర్తీ సురేష్ జోడీ రిపీట్ కానుంది. ఈ ఇద్దరూ ‘నేను లోకల్’లో తొలిసారి జంటగా నటించారు. తాజాగా ‘దసరా’లో నటిస్తున్నారు. తెలంగాణలోని గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఇంకోవైపు ఇంకోసారి ఖుషీగా జోడీ కట్టారు విజయ్ దేవరకొండ-సమంత. ‘మహానటి’లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖుషి’లో నటిస్తున్నారు. వీళ్లే కాదు.. రెండోసారి జంటగా కనిపించనున్న హీరో-హీరోయిన్లు ఇంకా ఉన్నారు. -
రిపీట్... హిట్‌కు సానపెట్ట...రా!
కొన్ని కాంబినేషన్లు ఎప్పుడూ క్రేజీనే. సెంటిమెంట్ మీద నడిచే సినీసీమలో అయితే మరీనూ! ఒక డెరైక్టర్, ఒక హీరో కలసి గతంలో ఒక సూపర్‌హిట్ ఇచ్చారంటే చాలు... వాళ్ళ కాంబినేషన్లో తాజా సినిమా మీద అనేక అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం హిందీలో అలాంటి క్రేజీ హిట్ కాంబినేషన్ల సినిమాలు కొన్ని ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. సినీ వ్యాపార వర్గాలనూ, ప్రేక్షకులనూ ఏకకాలంలో ఆకర్షిస్తున్న అలాంటి క్రేజీ ‘రిపీట్’ కాంబినేషన్లు... పాత బాక్సాఫీస్ సక్సెస్‌ను కూడా రిపీట్ చేస్తాయా? రోహిత్‌శెట్టి - షారూక్‌ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లా...దూసుకెళ్ళేందుకు... అయిదేళ్ల క్రితం మాట ఇది. అప్పుడు అజయ్ దేవగన్‌తో ‘సింగం’ సినిమా రూపొందిస్తున్నారు రోహిత్ శెట్టి. అప్పుడో ఆలోచన వచ్చిందాయనకు. ప్రముఖ నటుడు సంజీవ్‌కుమార్ కథానాయకునిగా నటించిన ‘అంగూర్’ చిత్రం రీమేక్ చేయాలన్నదే ఆ ఆలోచన. సంజీవ్‌కుమార్ పాత్రకు షారూక్ ఖాన్‌ను అనుకున్నారు. ఆ విషయం షారూక్‌తో కూడా చెప్పారు. కానీ, ఎందుకో ఆ ఆలోచన ఆచరణలోకి రాలేదు. కట్ చేస్తే... ముంబై నుంచి రామేశ్వరం వరకూ సాగే ఓ ప్రేమకథకు వాణిజ్య హంగులు జోడించి, షారూక్‌కు ఓ కథ చెప్పారు రోహిత్. ఆ కథ షారూక్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అదే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’. షారూక్, దీపికా పదుకొనే జంటగా నటి ంచిన ఈ చిత్రం మంచి విజయం సాధించి, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు కొద్ది విరామం తరువాత మళ్ళీ రోహిత్‌శెట్టి, షారూక్ల కాంబినేషన్ రిపీట్ అవుతోంది. తాజాగా ఈ దర్శక, హీరోల కలయికలో వస్తున్న చిత్రం ‘దిల్వాలే’. ఈ చిత్రంలో వరుణ్‌ధావన్, కృతీసనన్ మరో జోడీ. రోహిత్, షారుక్‌ఖాన్‌ల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం కావడం, పైగా ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’తో హిట్ జోడీ అనిపించుకున్న షారూక్, కాజోల్ చాలా విరామం తరువాత ఈ చిత్రంలో జంటగా నటిస్తుండడంతో ఈ ‘దిల్వాలే’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి... ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా? ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో కొత్త రికార్డులు సృష్టించిన షారూక్, రోహిత్ వాటిని బద్దలు కొడతారా? ఆ సంగతి తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకూ ఆగాల్సిందే. బడ్జెట్: 75 కోటు్లూ వసూళ్లు: 400 కోట్లు హృతిక్ రోషన్ - ఆశుతోష్ గోవారీకర్ చరిత్రను తిరగదోడదాం! ‘జోథా అక్బర్’... హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్ జంటగా ఆశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో రూపొందిన చారిత్రక చిత్రం ఇది. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికో హైలైట్. ఆ సూపర్‌హిట్ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ హృతిక్ హీరోగా ఆశుతోష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మొహెన్జొదారో’. చరిత్ర నేపథ్యంలో ప్రేమ, సాహసం ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘జోథా అక్బర్’ వంటి విజయాన్ని ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ‘మొహెన్జొ దారో’పై భారీ అంచనాలు ఉన్నాయి. వైవిధ్యమైన కథాంశాలను అద్భుతంగా తెరకెక్కించే నైపుణ్యం ఉన్న దర్శకునిగా ఆశుతోష్కీ, దర్శకుడు అనుకున్న పాత్రలో ఒదిగిపోయే ప్రతిభ ఉన్న హీరోగా హృతిక్కీ పేరుంది. కాబట్టి, ఈ దర్శక, హీరోలు మరో ఘనవిజయం సాధిస్తారని బాలీవుడ్ జనం బలంగా నమ్ముతున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. బడ్జెట్:40 కోటు్లూ వసూళ్లు:115 కోట్లు అక్షయ్‌కుమార్ - ప్రభుదేవా ఈ సింగ్...బాక్సాఫీస్ కింగ్? ‘వాంటెడ్’ చిత్రం ద్వారా హిందీ రంగానికి దర్శకునిగా పరిచయమయ్యారు ప్రభుదేవా. తెలుగు సూపర్‌హిట్ మహేశ్‌బాబు ‘పోకిరి’కి రీమేకైన ఆ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడంతో దక్షిణాది చిత్రాలవైపు కన్నెత్తి చూసే తీరిక లేనంతగా అక్కడే బిజీ అయ్యారు ప్రభుదేవా. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘రౌడీ రాథోడ్’ ఒకటి. తెలుగు ‘విక్రమార్కుడు’కి ఇది రీమేక్. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ తరువాత ‘రాంబో... రాజ్‌కుమార్’, ‘యాక్షన్ జాక్సన్’ లాంటి సినిమాలు చేసిన ప్రభుదేవా ఇప్పుడు మళ్లీ అక్షయ్‌కుమార్‌తో సినిమా చేస్తున్నారు. వీరిద్ధరి కాంబినేషన్లో వస్తున్న ఈ తాజా చిత్రం - ‘సింగ్ ఈజ్ బ్లింగ్’. అక్షయ్‌కుమార్‌కి హిందీ రంగంలో కలక్షన్ కింగ్ అనే పేరుంది. మరి.. ఈ సింగ్ ఆ పేరు నిలబెడతాడా? బాలీవుడ్లో దర్శకునిగా ప్రభుదేవా ఖాతాలో మరో విజయం పడుతుందా? మరో మూడు నెలల్లో తెలిసిపోతుంది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. బడ్జెట్:45 కోటు్లూ వసూళ్లు:200 కోట్లు సల్మాన్ ఖాన్ - కబీర్‌ఖాన్ నో డౌట్... బ్లాక్‌బస్టర్ హిట్! హిందీ చిత్రరంగంలోని ప్రసిద్ధ సంస్థల్లో ‘యశ్‌రాజ్ ఫిలిమ్స్’ ఒకటి. అలాంటి సంస్థలో వరుసగా మూడు సినిమాల్లో అవకాశం రావడమంటే మరీ గొప్ప విషయం. ఆ అదృష్టం దక్కిన దర్శకుడు కబీర్‌ఖాన్. ‘కాబూల్ ఎక్స్‌ప్రెస్’తో కబీర్‌ను దర్శకునిగా పరిచయం చేసింది యశ్‌రాజ్ సంస్థ. ఆ తర్వాత అదే సంస్థలో ‘న్యూయార్క్’ చిత్రం చేశారు కబీర్ ఖాన్. మూడో సినిమా కూడా ఆ సంస్థలోనే! సల్మాన్‌ఖాన్ హీరోగా ‘ఏక్‌థా టైగర్’. ఆ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. వాస్తవానికి ఆ చిత్రం షారూక్ ఖాన్ చేయాల్సి ఉంది. కానీ, ఆయనకు ఖాళీ లేకపోవడంతో సల్మాన్ చేశారు. హిట్ హీరో సల్మాన్, ఈసారి మరో నిర్మాత ‘రాక్‌లైన్’ వెంకటేశ్‌తో కలిసి సినిమా నిర్మించారు. కబీర్ఖాన్ను డెరైక్టర్‌గా పెట్టుకున్నారు. అదే ‘బజరంగీ భాయ్‌జాన్’. నిన్న శుక్రవారం ప్రపంచమంతటా విడుదలైంది. ‘ఏక్ థా టైగర్’ తరువాత కబీర్, సల్మాన్ ఖాన్ల కాంబినేషన్ ఇందులో రిపీటైంది. మన దేశంలో తప్పిపోయిన ఓ చిన్నారిని పాకిస్తాన్‌లోని ఆమె స్వస్థలానికి భద్రంగా చేర్చే హనుమద్భక్తుడు బజరంగీ పాత్రను సల్మాన్ పోషించారు. ‘ఏక్ థా టైగర్’తో మామూలు హిట్ ఇచ్చిన సల్మాన్-కబీర్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తారో అనే చర్చ జరిగిన నేపథ్యంలో మొదటి ఆటకే ‘సూపర్ హిట్’ టాక్ తెచ్చుకుందీ చిత్రం. ప్రతి ఒక్కర్నీ ఉద్వేగానికి గురి చేసే చిత్రం ఇదని చూసినవాళ్లు అంటున్నారు. సో.. రెండోసారి కూడా కబీర్-సల్మాన్ ‘హిట్ కాంబినేషన్’ అని నిరూపించుకున్నారు. ఇటీవల హిందీలో విడుదలైన చిత్రాల రికార్డ్లను ఈ చిత్రం బద్దలు కొట్టడం ఖాయమట. బడ్జెట్:75 కోటు్లూ వసూళ్లు:320 కోట్లు