ఒక సినిమాలో హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే మళ్లీ ఆ జంటను చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అయితే ఆ జంటకి మ్యాచ్ అయ్యే కథ దొరకాలి.. ఆ కథకు ఈ ఇద్దరినే హీరో–హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచన డైరెక్టర్‌కి రావాలి. ఇలా కొన్ని జంటలకు కథ కుదిరింది.ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తే బాగుండనే ఆలోచన డైరెక్టర్‌కీ వచ్చింది. ‘రిపీట్టే..’ అంటూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆ జంటలు చేస్తున్న చిత్రాల గురించి...
► ‘వినయ విధేయ రామ’ చిత్రంతో ఆకట్టుకున్న హీరో రామ్‌చరణ్–హీరోయిన్ కియారా అద్వానీ ‘గేమ్ చేంజర్’ కోసం రెండోసారి జోడీ కట్టారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ‘భరత్ అనే నేను’ (2018) సినిమాతో కియారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘వినయ విధేయ రామ’ (2019) లో రామ్‌చరణ్‌కి జోడీగా నటించారామె. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇక ఈ ఇద్దరూ జత కట్టిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ΄÷లిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూ΄పొందుతోంది.
► ‘లవ్‌స్టోరి’ (2021)తో ప్రేక్షకులకు అందమైన ప్రేమకథని చూపించారు హీరో నాగచైతన్య–హీరోయిన్ సాయిపల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూ΄పొందిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ జంట రెండేళ్లకు రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ‘ప్రేమమ్’ (2016), ‘సవ్యసాచి’ (2018) చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య– డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో మూడో సినిమా రూ΄పొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. చైతు–సాయిపల్లవి తొలిసారి జత కట్టిన ‘లవ్‌స్టోరి’లానే తాజా చిత్రం కూడా ప్రేమ ప్రధానాంశంగా సాగుతుంది.
► ‘భీష్మ’ వంటి హిట్ సినిమా తర్వాత నితిన్–రష్మికా మందన్నా రెండోసారి నటించనున్న సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘భీష్మ’ (2020) చిత్రంలో నితిన్– రష్మిక తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రత్యేకించి నితిన్–రష్మిక డ్యాన్స్‌లు ప్రేక్షకులను అలరించాయి. ఇక వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘ఛలో’ చిత్రం ద్వారానే రష్మిక తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ విధంగా నితిన్–రష్మిక–వెంకీ కుడుముల.. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తాజాగా రెండో సినిమా రూ΄పొందుతోందని చెప్పొచ్చు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి రష్మికా మందన్న తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా డేట్స్ సర్దుబాటు కాక΄ోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. ఆమె స్థానంలో శ్రీలీల అవకాశం అందుకున్నారని టాక్. ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
► ‘గీత గోవిందం’(2018), ‘డియర్ కామ్రేడ్’ (2019) వంటి చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారని టాక్. విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత హీరోయిన్‌గా శ్రీ లీలను ఫిక్స్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూ΄పొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే వరుస సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ‘వీడీ 12’ ్రపాజెక్ట్ నుండి శ్రీ లీల తప్పుకున్నట్లు టాక్ . దీంతో చిత్ర యూనిట్ రష్మికా మందన్నాని సంప్రదించగా... ఈ బ్యూటీ పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే విజయ్–రష్మిక కలిసి నటించనున్న మూడో చిత్రం ఇదే అవుతుంది. అయితే నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పుకోవడంతో ఆ ప్లేస్‌ని శ్రీ లీల భర్తీ చేశారని, విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుంటే ఈ ్రపాజెక్ట్‌లోకి రష్మిక ఎంట్రీ ఇచ్చారనే వార్తలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.
► ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత హీరో కల్యాణ్ రామ్–హీరోయిన్ సంయుక్తా మీనన్ ‘డెవిల్’ సినిమా కోసం రెండోసారి జోడీ కట్టారు. వశిష్ఠ దర్శకత్వంలో కల్యాణ్ రామ్–సంయుక్తా మీనన్ జంటగా నటించిన తొలి చిత్రం ‘బింబిసార’ (2022). ఈ చిత్రవిజయంతో హిట్ పెయిర్ అనిపించుకున్న కల్యాణ్ రామ్–సంయుక్తా మీనన్ తాజాగా ‘డెవిల్’లో నటిస్తున్నారు. దేవాన్ష్ నామా సమర్పణలో పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కానుంది.
ఇలా రిపీట్ అవుతున్న జంటలు ఇంకొన్ని ఉన్నాయి.
రిపీట్టే...
Published Sat, Oct 7 2023 4:30 AM | Last Updated on Sat, Oct 7 2023 8:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment