హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గత ఏడాది మార్చి 30న విడుదలైన ‘దసరా’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. నాని కెరీర్‌లోని ఈ 33వ సినిమాను ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరియే నిర్మించనున్నారు. ‘దసరా’ విడుదలై, ఏడాది పూర్తయిన సందర్భంగా తాజా చిత్రాన్ని శనివారం (మార్చి 30)న అధికారికంగా ప్రకటించింది యూనిట్.
‘లీడర్ కావాలనుకుంటే నీకు గుర్తింపు అవసరం లేదు’ అని అర్థం వచ్చేలా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ పై ఓ ఇంగ్లిష్ కోట్ ఉంది. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇక ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. అలాగే సుజిత్ డైరెక్షన్‌లో హీరోగా నాని ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment